Sukhwinder Singh refutes Ram Gopal Varma’s claims: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' గురించి భారతీయ సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. డానీ బోయిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2008లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై మురికి వాడల్లో చిన్నారుల జీవితం, వారిలో దాగి ఉన్న టాలెంట్ ను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ముంబై మురికివాడలో పెరిగిన ఓ బాలుడు ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమంలో పాల్గొని కోట్ల రూపాయలు ఎలా గెలిచాడు అనేది ఈ సినిమా కథ.


'స్లమ్‌డాగ్ మిలియనీర్'కు మ్యూజిక్ అందించిన రెహమాన్


'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రానికి సంగీత దిగ్గజం రెహమాన్ అందించిన మ్యూజిక్ మరో లెవల్ అనుకోవచ్చు. ఈ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన ‘జయహో’ పాట అంతర్జాతీయ వేదికలపై పలు ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొట్టింది. ఆస్కార్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్, BAFTA, గ్రామీ లాంటి అవార్డులను దక్కించుకుంది. ఈ పాటతో రెహమాన్ క్రేజ్ విశ్వవ్యాప్తం అయ్యింది. అయితే, ఈ పాటకు సంగీతం అందించి రెహమాన్ కాదంటూ తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాంబు పేల్చారు. ఈ పాటను సింగర్ సుఖ్వీందర్ సింగ్ కంపోజ్ చేశారని వెల్లడించారు. అదొక్కటే కాదని... రెహమాన్ కు పేరు తెచ్చిన చాలా పాటలను ఆయన కంపోజ్ చేయలేదంటే సంచనల వ్యాఖ్యలు చేశారు.


Also Read: ఏ పార్టీని టార్గెట్ చేయలేదు, వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం- 'ప్రతినిధి 2' దర్శకుడు మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్


‘జయహో’ పాట క్రెడిట్ అంతా రెహమాన్ దే!


ఆర్జీవీ వ్యాఖ్యలపై తాజాగా సింగర్ సుఖ్వీందర్ సింగ్ స్పందించారు. వర్మ చెప్పినట్లు ‘జయహో’ పాటను తాను కంపోజ్ చేయలేదని చెప్పారు. ఆ పాటకు సంబంధించిన పూర్తి క్రెడిట్ రెహ‌మాన్ కే దక్కుతుందన్నారు. “’జయహో’ పాటను AR రెహమాన్ కంపోజ్ చేశారు. నేను కేవలం ఆ పాటను పాడాను. రామ్ గోపాల్ వర్మ చాలా పెద్ద సెలబ్రిటీ. కానీ, ఆయనకు సరైన సమాచారం లేక అలా మాట్లాడి ఉంటారు. ఈ పాటను ఈ పాటను గుల్జార్ గారు రాశారు. రెహమాన్‌ గారికి నచ్చింది. ఆ తర్వాత ముంబైలోని జుహులో ఉన్న నా స్టూడియోలో కంపోజ్ చేశారు. అతను సుభాష్ జీ (దర్శకుడు సుభాష్ ఘాయ్)కి వినిపించారు. అప్పటి వరకు నేను పాట పాడలేదు. అయితే, సుభాష్ ఘయ్ పాట నచ్చినప్పటికీ, స్క్రిప్ట్‌ కు సరిపోకపోవడంతో దానిన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత నేను ఆ పాటను పాడాను. దాన్ని ఆ తర్వాత రెహమాన్ గారికి పంపించాను. ఆయనకు నచ్చింది. దాన్ని 'స్లమ్‌డాగ్ మిలియనీర్' దర్శకుడు డానీ బాయిల్‌కి వినిపించేలా చేశాను. ఈ పాట తనకు నచ్చడంతో ఆ సినిమాలో పెట్టారు. అటు 'యువరాజ్' కోసం సుభాష్ గారికి మరో పాటను కంపోజ్ చేసి ఇచ్చారు” అని సుఖ్వీందర్ సింగ్ వెల్లడించారు. అంతేకాదు, ఈ పాట రికార్డింగ్ కు  కేవలం అరగంట సమయమే తీసుకున్నట్లు తెలిపారు. ‘జయహో’ పాటకు గాను రెహమాన్ ఏకంగా రెండు అస్కార్ అవార్డులు అందుకుని సంచలనం సృష్టించారు.  


Read Also: భర్తను కోల్పోయిన ఆమె రెండో పెళ్లికి ఒప్పుకోదు - కానీ, ఆ ‘కోరిక’ తీర్చాలంటుంది.. గుండె బరువెక్కించే మూవీ ఇది