సిగరెట్లు కాల్చడం అంటే సొంత ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే. ప్రాణాన్నే పణంగా పెట్టి సిగరెట్లు కాల్చడం అవసరమా? అయినా సరే ఎంతోమంది రోజుకి పెట్టెలకు పెట్టెలు సిగరెట్లు కాల్చేవారు కూడా ఉన్నారు. కొంతమంది మూడు నుంచి నాలుగు సిగరెట్లతో ఆపుకుంటున్నారు. నిజానికి రోజుకు ఒక సిగరెట్ కాల్చినా కూడా ఆరోగ్యం పై పడే ప్రభావం అధికంగానే ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం కేవలం సిగరెట్ల కోసమే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెడుతున్న డబ్బు 1,77 342 కోట్ల రూపాయలు. ఆ డబ్బుతో ఎన్నో పేద దేశాలను కాపాడుకోవచ్చు. ఎంతోమంది రోగులకు మళ్ళీ ప్రాణం పోయచ్చు. కానీ సిగరెట్ల వల్ల రోగులుగా మారుతున్న వారి సంఖ్య ప్రతిరోజూ పెరిగిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ప్రపంచంలో 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీరంతా కలిసి రోజుకు 2000 కోట్ల సిగరెట్లు పీల్చి పడేస్తున్నారు. దీనివల్ల వీరి ఆరోగ్యం పాడవ్వడమే కాదు, వారు వదిలిన పొగను పీల్చిన చుట్టుపక్కల వారి ఆరోగ్యం కూడా ఎంతో ప్రభావితం అవుతుంది.


సిగరెట్లు కాలాక వదిలే పొగలో 4800 రకాల హానికరమైన రసాయనాలు ఉంటాయి. అందులో 70 రకాల రసాయనాలు కచ్చితంగా క్యాన్సర్లు కలగజేసేవే. అందుకే సిగరెట్లు తాగే వారిలో ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు. సిగరెట్లు కాల్చడం వల్ల మన శరీరంలోని ప్రతి అవయవానికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మెడ క్యాన్సర్, నోటి క్యాన్సర్, పెద్ద పేగు, మలద్వార క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, బ్లాడర్ కాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్లు... సిగరెట్ల వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇక మగవారికి మాత్రమే వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్‌కు, సిగరెట్‌కు ప్రత్యక్షంగానే సంబంధం ఉందని చెబుతున్నారు వైద్యులు. సిగరెట్లలో బెంజిన్ ఉంటుంది. ఇది లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కేవలం క్యాన్సర్లే కాదు గుండె జబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, పక్షవాతం వంటివన్నీ కూడా సిగరెట్లు కాల్చడం వల్ల వస్తాయి.


కాల్చడం మానేస్తే చాలా తక్కువ సమయంలోనే ఆరోగ్యం తిరిగి పొందవచ్చు. సిగరెట్ కాల్చినప్పుడు గుండె ఎంతో ఇబ్బంది పెడుతుంది. సిగరెట్ కాల్చిన 20 నిమిషాల తర్వాత వరకు గుండె ఒత్తిడికి లోనవుతూనే ఉంటుంది. దీనివల్లే గుండెపోటు వచ్చే రిస్క్ పెరుగుతుంది. సిగరెట్లు కాల్చడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి సిగరెట్లు తాగడం పూర్తిగా మానేస్తేనే ఆరోగ్యానికి మంచిది.


Also read: బీట్‌రూట్‌తో మైసూర్ పాక్ చేసేయండి, ఎంతో ఆరోగ్యం



Also read: మా చెల్లి చేస్తున్న తప్పును నేను భరించాల్సి వస్తోంది, నాన్నకు చెప్పడం ఎలా?

































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.