By: Haritha | Updated at : 11 Jul 2022 08:36 AM (IST)
Jojoba
యువతను వేధిస్తున్న సమస్యలో ముఖ్యమైనవి మొటిమలు, చర్మం పాలిపోయినట్టు అవ్వడం, చుండ్రు... వీటన్నింటికీ ఒక్క నూనెతో చెక్ పెట్టొచ్చు. అదే జోజోబా ఆయిల్. దీన్ని సిమోండ్సియా చినెన్సిన్సిస్ అనే మొక్కల నుంచి తయారుచేస్తారు. ఈ మొక్కలు మనదేశంలో దొరకవు. అమెరికాలోని, మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఆ మొక్కల విత్తనాలతో జోజోబా నూనెను తీస్తారు. ఆ నూనెను మాత్రం దిగుమతి చేసుకుంటాం కాబట్టి ధర కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. జోజోబా నూనె జుట్టుకు, చర్మానికి చేసే మేలు ఇంతా అంతా కాదు.
మెరిసే చర్మం
జోజోబా నూనెలో ఏ,ఇ విటమిన్లు, ఒమేగా 6 ప్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి రక్షణలా నిలుస్తాయి. చర్మంలో తేమను పట్టి ఉంచడానికి ఉపయోగపడతాయి. విటమిన్ ఇ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ లక్షణాలు చర్మంపై రక్షిత పొరను ఏర్పాటు చేస్తుంది.
పొడి చర్మానికి...
కొందరిలో పొడి చర్మం చాలా చికాకును కలిగిస్తుంది. అలాంటివారు ఈ నూనెను రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇది తేమను పట్టి ఉంచి చర్మం పొడిబారకుండా కాపాడతుంది.
మొటిమలకు చెక్
చాలా మంది యువత మొటిమలతో ఇబ్బంది పడుతున్నారు. మొటిమలు వచ్చే చర్మానికి జోజోబా ఆయిల్ ఉత్తమ ఎంపిక.దీనిలో యాంటీ బాక్టిరియల్ లక్షణాలు అధికం. బ్యాక్టిరియాతో పోరాడుతుంది. చర్మగ్రంధుల్లోని నూనె,తేమ సమతుల్యతలను కాపాడుతుంది. మొటిమలున్న చోట ఈ ఆయిల్ రాస్తే చాలా మంచిది.
ఏజింగ్‌ను నిరోధిస్తుంది
జోజోబా ఆయిల్ లో హైడ్రేటింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికం. ఇది వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. ఈ నూనెను చర్మానికి రోజూ రాసుకోవడం వల్ల చర్మంపై గీతలు పడడం, ముడతలు పడడం వంటి సమస్యలు రావు. చిన్న చిన్న గాయాలకు చికిత్స చేయడంలో కూడా ముందుంటుంది.
మేకప్ రిమూవర్
చాలా మందికి రోజూ మేకప్ వేసుకునే అలవాటు ఉంది. జోజోబా ఆయిల్ గొప్ప మేకప్ రిమూవర్ గా పనిచేస్తుంది. ముఖాన్ని తేమగా ఉంచుతుంది. చర్మంపై ఉన్న మురికిని, ధూళిని తొలగిస్తుంది.
లిప్‌బామ్
లిప్ బామ్‌గా జోజోబా ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది.పగిలిన పెదాలకు రాస్తే అవి మృదువుగా మారుతాయి. జోజోబా ఆయిల్ ఇంట్లో ఉంటే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.
చుండ్రును తొలగించి
చుండ్రుతో ఇబ్బంది పడుతున్న వారికి జోజోబా ఆయిల్ వరమనే చెప్పాలి. ఈ నూనెలో పల్మిటిక్, స్టెరిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను తలపై మసాజ్ చేస్తే చుండ్రు, దాని వల్ల వచ్చే దురద తగ్గుతుంది.
Also read: ఆ ఊరికి అల్లుడిగా వెళతారా? కట్నంగా ఏమిస్తారో తెలిస్తే చచ్చినా వెళ్లరు
Mutton Fry Recipe : ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
Early Signs of Liver Problems : ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
30 Minute Daily Walk : ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
Excessive Hair Fall : జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
Easy Chicken Fry Recipe : వంట సరిగ్గా రానివారు కూడా ఈజీగా చేసుకోగలిగే చికెన్ ఫ్రై రెసిపీ.. ఈజీగా, టేస్టీగా చేసుకోండిలా
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు