హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ విభాగం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ, ఎల్ఎల్‌బీ/ఎల్ఎల్ఎం ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 15లోగా దరఖాస్తులు సమర్పించవలెను.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 07.
➽ ప్రొటెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
➽ లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్: 01 పోస్టు
➽ సోషల్ వర్కర్: 01 పోస్టు
➽ ఔట్‌రీచ్ వర్కర్: 03 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ, ఎల్ఎల్‌బీ/ఎల్ఎల్ఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 15.12.2022.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
the District Welfare Officer, WCD&sc, Hyderabad,
Collectorate Premises. I Floor. Old Collectorate building,
Nampally Station Road, Abids,
Hvderabad 500 001.
Also Read:
గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో టీచింగ్ పోస్టులు, వివరాలివే!
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కరీంనగర్, వనపర్తిలలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్‌టీచింగ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సీ(అగ్రికల్చర్/హార్టికల్చర్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్/అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 09లోగా ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించవలెను. డిసెంబరు 14,15 తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 213 ఉద్యోగాలు, వివరాలు ఇవే!
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా జేవో&జేఎస్, సిర్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి డిప్లొమా(మైనింగ్/ మైనింగ్ ఇంజినీరింగ్/ మైన్ సర్వేయింగ్)/ డిగ్రీ(సివిల్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల!
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, మెరిట్ & రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..