West Central Railway Apprentices Recruitment: మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (RRC WCR) పరిధిలోని డివిజన్‌/యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌ (ACT Apprentice) శిక్షణ కోసం నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 3015 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


వివరాలు..


* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 3,015.


పోస్టుల కేటాయింపు: యూఆర్-1224, ఎస్సీ-455, ఎస్టీ-218, ఓబీసీ-811, ఈడబ్ల్యూఎస్-307. వీటిలో దివ్యాంగులకు 111 పోస్టులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 80 పోస్టులు కేటాయించారు.


యూనిట్లవారీగా ఖాళీలు..


➥ జేబీపీ డివిజన్: 1164 పోస్టులు


➥ బీపీఎల్ డివిజన్: 603 పోస్టులు


➥ కోటా డివిజన్: 853 పోస్టులు


➥ సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్: 170 పోస్టులు


➥ డబ్ల్యూఆర్ఎస్ కోటా: 196 పోస్టులు


➥ హెచ్‌క్యూ/జేబీపీ: 29 పోస్టులు 


అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 


ట్రేడ్‌లు: కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, పెయింటర్ (జనరల్), ప్లంబర్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్).


వయోపరిమితి: 14.12.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-13 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 


ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


దరఖాస్తు ఫీజు: రూ.136. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.36.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.12.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు:14.01.2024.


Notification


Online Application


                               


ALSO READ:


రైట్స్‌ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
గురుగ్రామ్(హరియాణా)లోని రైట్స్‌ లిమిటెడ్- ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్/నాన్-ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు సంబంధిత వెబ్‌పోర్టల్‌ల ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు డిసెంబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
కోల్‌కతా ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే (SER)-రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) వివిధ డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...