గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్‌ లిమిటెడ్ సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ క్వాలిటీ అసూరెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. పర్సనల్‌ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు...


మొత్తం ఖాళీలు: 140


➥ సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌: 40 పోస్టులు


అర్హత: గ్రాడ్యుయేషన్ (సివిల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్).


అనుభవం: కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 40 సంవత్సరాలకు మించకూడదు.


➥ ఫీల్డ్‌ క్వాలిటీ అసూరెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజినీర్‌: 100 పోస్టులు


అర్హత: గ్రాడ్యుయేషన్ (సివిల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్).


అనుభవం: కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ ద్వారా రెజ్యూమ్ పంపాలి.


ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు చివరి తేది: 30.09.2023.


Website


E-Mail: infs1@wapcos.co.in



ALSO READ:


ఎన్‌ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు
చెన్నైలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 47 టెక్నికల్, ల్యాబొరేటరీ పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రస్తుతానికి ఉద్యోగ ప్రకటన మాత్రమే సంస్థ వెల్లడించింది. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.35,400 - రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టులకు రూ.18,000 - 56,900 వరకు జీతం చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 51 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు, వివరాలు ఇలా
గువాహటి మాలిగావ్‌లోని నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే వివిధ క్రీడాంశాల్లో స్పోర్ట్స్ పర్సన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజేతలైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎయిమ్స్‌-కళ్యాణిలో 120 గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..