Director of Medical Education: ఏపీలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనిద్వారా 170 అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్టులను భర్తీచేయనున్నారు. వాక్‌ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ /లాటరల్ /కాంట్రాక్టు పద్ధతిలో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రుల్లో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టుల్ని శాశ్వత ప్రాతిపదికన (డైరెక్ట్/లేటరల్) భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 18, 20 తేదీల్లో విజయవాడలో వాక్ఇన్ నిర్వహించనున్నారు. అదేవిధంగా విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) విశాఖపట్నంలో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం డిసెంబరు 15న విశాఖపట్నంలో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
వివరాలు..
* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 170.
➥ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు: 144 పోస్టులు (పాత కాలేజీల్లో 77, కొత్త మెడికల్ కాలేజీల్లో 67)
వాక్‌ఇన్ తేది: 18.12.2023, 20.12.2023.
సమయం: ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.
వాక్ఇన్ వేదిక: O/o Director of Medical Education, Old GGH Campus, Hanuman Peta,Vijayawada.
➥ విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) విశాఖపట్నం: 26 పోస్టులు
వాక్‌ఇన్ తేది: 15.12.2023.
సమయం: ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.
వాక్ఇన్ వేదిక: VIMS, Hanumanthawaka Junction,Visakhapatnam.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ (MD/MS/DNB/DM) ఉత్తీర్ణతోపాటు సీనియర్ రెసిడెంట్‌గా(సీనియర్ రెసిడెన్సీ) ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలలోపు ఉండాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 8 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు..
➥ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
➥ పదోతరగతి సర్టిఫికేట్ (పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం)
➥ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
➥ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్
➥ పీజీ డిగ్రీ సర్టిఫికేట్/సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్
➥ పీజీ డిగ్రీ మార్కుల మెమో/సూపర్ స్పెషాలిటీ డిగ్రీ మార్కుల మెమో
➥ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
➥ సీనియర్ రెసిడెన్సీ కంప్లీషన్ సర్టిఫికేట్
➥ దివ్యాంగులైతే డిజెబిలిటీ సర్టిఫికేట్ (SADAREM) తీసుకురావాలి.
➥ ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్)
➥ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అవసరం. ఒకవేళ సర్టిఫికేట్ సమర్పించనిపక్షంలో ఓసీగా పరిగణిస్తారు.
VIMS, Visakhapatnam Notification
ALSO READ:
➥ ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
➥ ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
➥ ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
➥ ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా