Tata Advanced Systems Limited Jobs: చాలా చిన్న క్వాలిఫికేషన్లతో.. చిన్న ఉద్యోగాలు చేసే టెక్నీషియన్లకు ఇది మంచి అవకాశం. ఓ అంతర్జాతీయ సంసస్థలో కెరీర్‌ను నిర్మించుకునేందుకు ఇదే మంచి తరుణం. ఇండియాలో ప్రైవేటు  రంగంలోని అతిపెద్ద డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీల్లో ఒకటైన  టాటా ఏరోస్పేస్‌ నేరుగా ఉద్యోగాలు ఇస్తోంది. హైదరాబాద్ లోని శంషాబాద్‌లో ఉన్న Tata Advanced Systems Limited (TASL) టెక్నీషియన్లను  ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది.  ITI పూర్తి చేసిన వారికి అప్రెంటిస్‌లకు TASL లో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. కనీసం మూడేళ్ల నుంచి 8 ఏళ్లు అనుభవం ఉన్నవాళ్లు దీనికి అర్హులు

 

ఉద్యోగం -అర్హతలు

ఉద్యోగం-అసెంబ్లీ ఆపరేటర్

విద్యార్హతలు: ITI  ఫిట్టర్, అప్రెంటీస్

అనుభవం- 3 నుంచి 8ఏళ్లు

 

జాబ్ డిస్క్రిప్షన్:

ఇంజినీరింగ్ డిజైన్లను పరిశీలించగలగడం, అర్థం చేసుకోవడం, ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చర్, డిజైనింగ్, ఫిట్టింగ్, అసెంబ్లింగ్, ఇన్ స్టాలేషన్‌లలో అనుభవం ఉండాలి

 

ఇంటర్వూ ఎక్కడ.. ? ఎప్పుడు…?

పై అర్హతులున్న అభ్యర్థులు నేరుగా సంబంధిత సర్టిఫికెట్లు తీసుకుని Walk-in interviews కి హాజరు కావచ్చు. ఏప్రిల్ 20వతేదీ, ఆదివారం  ఉదయం 10గంటల నుంచి… సాయంత్రం 5గంటలలోపు… Central Institute of Tool Design , IDA, Balanagar, Hyderabad లో ఇంటర్వూకు హాజరవ్వొచ్చు.

 

తీసుకురావలసిన డాక్యుమెంట్లు.

రెస్యుమేతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

ధృవీకృత ఐడెంటిటీ

విద్యార్హత సర్టిఫికెట్లు

ఉద్యోగ అనుభవ పత్రాలు

ప్రస్తుత కంపెనీ జాయినింగ్ లెటర్, సీటీసీ బ్రేకప్, చివరి మూడునెలలో పే స్లిప్‌లు తీసుకుని రావాలి.

 

 టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) టాటా గ్రూప్‌కు చెందిన వ్యూహాత్మక ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ విభాగం. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఏరోస్పేస్ డిఫెన్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో ఒకటిగా పేరుగాంచింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ డిఫెన్స్ సంస్థలతో భాగస్వామ్యాలు కలిగి ఉంది. ఏరోస్ట్రక్చర్లు & ఏరో-ఇంజిన్లు, ఎయిర్‌బోర్న్ ప్లాట్‌ఫారమ్‌లు & వ్యవస్థలు, రక్షణ వ్యవస్థలు, రక్షణ వాహనాలను రూపొందిస్తుంది.