VIMS Jobs : విశాఖ విమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(విమ్స్)లో 32 వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ డా.కె రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. 


ఈ విభాగాల్లో పోస్టులు భర్తీ



  • న్యూరో సర్జరీ-03

  • న్యూరాలజీ -02

  • పల్మనాలజీ 02

  • ఆర్థోపెడిక్స్-02 

  • జనరల్ మెడిసిన్-04 

  • ప్లాస్టిక్ సర్జరీ-02

  • సర్జికల్ గ్యాస్ట్రాలజీ-01

  • మెడికల్ గ్యాస్ట్రాలజీ-02

  • సర్జికల్ ఆంకాలజీ-02

  • మెడికల్ ఆంకాలజీ-02

  • ఎండోక్రినాలజీ-02 

  • కార్డియాలజీ-03

  • అనస్తీసియా-03

  • హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మెడికల్-02  


ఈ 32 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు భర్తీ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు కింద సంబంధం లేకుండా అన్ని పోస్టులు ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల నుంచి ఈ నెల 30వ తేదీ వరకు విమ్స్ ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులను పరిశీలించి జులై 2న మెరిట్ లిస్టు, 3వ తేదీన ఫిర్యాదుల స్వీకరణ, 4వ తేదీన ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తారు. మరిన్ని వివరాల కోసం www.vimsvskp.com వెబ్ సైట్ ను విజిట్ చేయండి. 


ఎయిర్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు


ఖాళీగా ఉన్న నాలుగు వందల జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసిందు. సైన్స్‌ లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు, ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన వాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్లు నేరుగా అధికారి వెబ్‌సైట్‌ https://www.aai.aeroకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వాళ్లు అడిగిన వివరాలు ఇచ్చి జులై 14 లోపు అప్లై చేసుకోవచ్చు.   


ఎంపిక ప్రక్రియ


అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్షలో పనితీరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్‌ల వెరిఫికేషన్/వాయిస్ టెస్ట్‌కి పిలుస్తారు. అభ్యర్థుల తాత్కాలిక ఎంపిక ఆన్‌లైన్‌లో పనితీరు ఆధారంగా తయారు చేసిన మెరిట్ జాబితా, వాయిస్ టెస్ట్‌లో అర్హత సాధించడం, పోస్ట్ కోసం సూచించిన అన్ని ఇతర అర్హత ప్రమాణాలకు లోబడి ఉంటుంది. ఇందులో మానసిక పరిస్థితిని కూడా పరీక్షిస్తారు. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ కూడా ఉంటుంది. 


విద్యార్హత: జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో సైన్స్‌లో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ (బిఎస్‌సి) పూర్తి చేసి ఉండాలి. ఏదైనా విభాగం నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థి ఇంగ్లీష్ రాయడంలో మాట్లాడటంలో మంచి పరిజ్ఞానం ఉండాలి.


వయో పరిమితి: వారు 14 జూలై 2022 నాటికి 27 సంవత్సరాలకు మించిన వయస్సును కలిగి ఉండకూడదు. గరిష్ట వయోపరిమితిలో PWDకి 10 సంవత్సరాలు, SC/STకి 5 సంవత్సరాలు, OBC (నాన్-క్రీమీ లేయర్)కి 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.