Visakhapatnam Co-operative Bank PO Recruitment: విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(VCBL), వివిధ బ్రాంచీల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 60 పీవో పోస్టులను భర్తీచేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 28 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ/ మెయిన్ పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.


వివరాలు..


*  ప్రొబేషనరీ ఆఫీసర్ (డిప్యూటీ మేనేజర్) పోస్టులు


ఖాళీల సంఖ్య: 30.


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.


వయోపరిమితి: 31.12.2023 నాటికి 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.01.1991 - 31.12.2003 మధ్య జన్మించినవారై ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.1,000.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రిలిమినరీ/ మెయిన్ పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.


పరీక్ష విధానం..


ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మొత్తంగా మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిలో జనరల్ ఇంగ్లిష్ 30 ప్రశ్నలు-30 మార్కులు-30 నిమిషాలు; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు-35 మార్కులు-30 నిమిషాలు; రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ & జనరల్ బ్యాంకింగ్ నుంచి 35 ప్రశ్నలు-35 మార్కులు-30 నిమిషాలు ఉంటాయి. మొత్తం పరీక్ష సమయం 90 నిమిషాలు (గంటన్నర). పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. 


మెయిన్ పరీక్ష: మొత్తం 250 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 158 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఆన్‌లైన్ పరీక్షకు 155 ప్రశ్నలు-200 మార్కులు, డిస్క్రిప్టివ్ పరీక్షకు-3 ప్రశ్నలు- 50 మార్కులు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 180 నిమిషాలు. ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంగ్లిష్ 35 ప్రశ్నలు-40 మార్కులు-35 నిమిషాలు; డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రిటేషన్-30 ప్రశ్నలు-50 మార్కులు-40 నిమిషాలు; రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్-40 ప్రశ్నలు-50 మార్కులు-40 నిమిషాలు; జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-60 మార్కులు-35 నిమిషాలు కేటాయించారు. ఇక డిస్క్రిప్టివ్ పరీక్షలో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కులు కోత విధిస్తారు.


ఇంటర్వ్యూ విధానం: మొత్తం 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.


పరీక్ష కేంద్రాలు: వైజాగ్‌, విజయవాడ, హైదరాబాద్‌, కర్నూలు, కాకినాడ, తిరుపతి.


పే స్కేల్: నెలకు రూ.20,330 నుంచి రూ.45,590.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.01.2024.


➥ ఆన్‌లైన్ పరీక్షతేది: ఫిబ్రవరి 2024.


Notification
Online Application

Website



ALSO READ:


కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌లో 280 ఉద్యోగాలు, వివరాలు ఇలా
న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (CSIR) సెక్షన్‌ ఆఫీసర్‌ (Section Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 280 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సీనియర్ స్టెనోగ్రాఫర్ (Senior Stenographer), సంబంధిత విభాగాలలో ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు ఆన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...