పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్- వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ కేడర్‌లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 71
➥ టెక్నికల్ అసిస్టెంట్: 20
➥ టెక్నీషియన్-1: 30
➥ ల్యాబొరేటరీ అటెండెంట్-1: 21
విభాగాలు: లైఫ్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, ఫిజియోథెరపీ, కెమిస్ట్రీ, సోషియాలజీ/సోషల్ వర్క్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, బయోఇన్ఫర్మేటిక్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్, ప్లంబర్, లేబొరేటరీ అటెండెంట్-I, క్యాటరింగ్ & హాస్పిటాలిటీ అసిస్టెంట్, ఇన్‌స్ట్రుమెంట్,
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 08.11.2023 నాటికి టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 సంవత్సరాలు, టెక్నీషియన్‌కు 28 సంవత్సరాలు, ల్యాబ్ అటెండెంట్‌కు 25 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.11.2023.
ALSO READ:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
పూణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 6లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నిమ్‌హాన్స్‌లో 161 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ విభాగంలో డిగ్రీతోపాటు తగిన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 18 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1,180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.885 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ అర్హతతో 436 ఎయిర్‌పోర్ట్ కొలువులు - ఎంపిక ఇలా!
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్ కేంద్రాల్లో అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..