UPSC National Defence Academy Results 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC NDA & NA (2) - 2022) నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ రాత పరీక్ష ఫలితాలు  సెప్టెంబరు 19న విడుదలయ్యాయి. సెప్టెంబరు 4న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్డీఏ రాతపరీక్షకు హాజరైన అభ్యర్ధులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో అభ్యర్థుల రూల్‌ నెంబర్ల ఆధారంగా ఈ ఫలితాలను విడుదల చేసింది. 



పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నియామక ప్రక్రియలో తర్వాత దశలో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ పూర్తయిన 15 రోజుల తర్వాత తుది ఎంపిక ఫలితాలను విడుదల చేస్తారు. రాతపరీక్షలో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరూ NDA 2 ఫలితాలు 2022 ప్రకటించిన రెండు వారాలలోపు ఇంటర్వ్యూ రౌండ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను సంబంధిత సర్వీస్ సెలక్షన్ బోర్డులకు సమర్పించాల్సి ఉంటుంది. వయసు ధృవీకరణ సర్టిఫికేట్ (ఏజ్‌ ప్రూఫ్‌), విద్యా అర్హత సర్టిఫికెట్లను సమర్పించాలి. 



UPSC NDA 2022 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..

1. ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను
2. https://www.upsc.gov.in ఓపెన్‌ చెయ్యాలి.
3. హోమ్‌పేజ్‌లో కనిపించే రాత పరీక్ష ఫలితాలపై క్లిక్ చెయ్యాలి. కొత్త పేజ్‌ ఓపెన్‌ అవుతుంది.
4. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ II 2022 లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
5. ఎన్డీఏ 2 ఫలితాలు పీడీఎఫ్‌ స్క్రీన్‌పై ఓపెన్‌ అవుతుంది.
6. మీ పేరును చెక్‌ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.
7. తర్వాత ఎన్డీఏ 2 ఫలితాలకు 2022 సంబంధించిన పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.



NDA & NA (2) ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 



Website



యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 4న దేశవ్యాప్తంగా UPSC NDA & NA (2) - 2022  పరీక్షను రెండు సెషన్లలో  నిర్వహించింది. ఉదయం 10 గంటల నుండి మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండో సెషన్ పరీక్ష నిర్వహించింది. దీనిద్వారా ఎన్టీఏ 150వ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ పరిధిలో దాదాపు 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు.



సందేహాలుంటే సంప్రదించవచ్చు..

* అభ్యర్థులకు ధ్రవపత్రాల పరిశీలన, విద్యార్హతలు తదితర విషయాల్లో ఏమైనా సందేహాలుంటే  011-23385271/011- 23381125/011-23098543 ఫోన్  నెంబర్లలో ఉదయం 10:00 గంటల నుంచి  సాయంత్రం 17:00 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించవచ్చు. 

* అలాగే ఇంటర్వ్యూకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 011-26175473, 011-23010097 నెంబర్లు లేదా joinindianarmy.nic.in for Army, Emai: officer-navy@nic.in ద్వారా సంప్రదించవచ్చు. 

* అదేవిధంగా నేవీ/నేవల్ అకాడమీకి సంబంధించిన సమస్యలపై  011-010231 Extn.7645/7646/7610 ఫోన్ నెంబర్లు లేదా joinindiannavy.gov.in  లేదా www.careerindianairforce.cdac.in ద్వారా సంప్రదించవచ్చు.


 


Also Read:


NEET UG Counselling: 'నీట్‌' యూజీ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ ఈ తేదీ నుంచే!
నీట్‌ యూజీ (NEET UG) కౌన్సెలింగ్‌ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) సెప్టెంబరు 25న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆరంభం కానుంది. మేరకు ఎంసీసీ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి సంబంధించి నీట్‌ యూజీ ప్రవేశ పరీక్షను జూలై 17న నిర్వహించింది.
నీట్ యూజీ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:

జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..