నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ(NDA & NA)-2023, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CDS)-2023 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు జనవరి10తో గడువు ముగియగా..  జనవరి 12 వరకు పొడిగించినట్లు యూపీఎస్సీ తెలిపింది. సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఎన్‌డీఏ ద్వారా-395, సీడీఎస్ ద్వారా 341 ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.



ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (I)- 2023
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (I)- 2023కు సంబంధించిన నోటిఫికేషన్‌ను డిసెంబరు 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2023, ఏప్రిల్ 16న రాతపరీక్ష నిర్వహించనుంది. శిక్షణ‌తోపాటు త్రివిధ ద‌ళాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు డిసెంబరు 21 నుంచి 2023, జనవరి 12 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాల్లో 2024, జనవరి 2 నుంచి నుంచి ప్రారంభమయ్యే 151వ కోర్సులో, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) 113వ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో నియమిస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


సీడీఎస్ ఎగ్జామినేష‌న్ (I)-2023 
కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(I)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) డిసెంబరు 21న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత ప‌రీక్ష ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 21 నుంచి 2023, జనవరి 12 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


యూసీఐఎల్‌లో వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులు, అర్హతలివే!
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పదోతరగతి అర్హతతోపాటు వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్‌ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ భర్తీ చేపట్టనున్నారు. ట్రేడ్ టెస్టు ఆధారంగా ఎంపికలు ఉంటాయి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...