సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2022 పరీక్షలు సెప్టెంబరు 16 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలను సెప్టెంబరు 16, 17, 18, 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్ష కోసం తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 16 నుంచి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. సెప్టెంబరు 16, 17, 18, 24, 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
మెయిన్స్ పరీక్షల షెడ్యూలు..
ఈ ఏడాది జూన్ 5న దేశవ్యాప్తంగా మొత్తం 72 నగరాల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను యూపీఎస్సీ నిర్వహించింది. జులై 12న ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు మొత్తం 11,845 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి 673 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
Also Read: AOC Jobs: ఆర్మీ ఏవోసీ రీజియన్లలో 3068 ఉద్యోగాలు, ఈ అర్హతలుంటే చాలు!
ఈ ఏడాది సివిల్ సర్వీసెస్–2022 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 5వ తేదీ ఉదయం పేపర్-1 (జనరల్ స్డడీస్) పరీక్షను నిర్వహించారు. ఈ పేపర్–1 ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించే పేపర్–2(అప్టిట్యూడ్ టెస్ట్–సీశాట్)ను 80 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహించారు.
పెరిగిన ఖాళీల సంఖ్య..
యూపీఎస్‌సీ ఈ ఏడాది 1011 ఖాళీలను ప్రకటించింది. గత ఏడాది కంటే 300 ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే 2021లో ప్రకటించిన ఖాళీలు చాలా తక్కువ. సివిల్ సర్వీసెస్ పరీక్ష నుంచి రైల్వే సర్వీసెస్‌ను తొలగించడం వల్ల ఇలా ఖాళీల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం వాస్తవంగా ప్రకటించిన ఖాళీలు 861. ఆ తర్వాత రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు చెందిన 150 ఖాళీలను ప్రభుత్వం జోడించడంతో మొత్తం 1011 ఖాళీలు ఏర్పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఖాళీలు 42 శాతం పెరిగాయి.
Also Read:
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..