సికింద్రాబాద్‌లోని సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్- ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఏవోసీ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్, జేఏవో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్, ఐటీఐ విద్యార్హతలు కలిగి ఉండాలి. ఫిజికల్/ ప్రాక్టికల్/ స్కిల్ పరీక్షలు, రాత పరీక్ష, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.  పోస్టుల వివరాలు..

 

మొత్తం ఖాళీల సంఖ్య: 3068     

 

పోస్టుల కేటాయింపు: జనరల్-1214, ఈడబ్ల్యూఎస్-307, ఓబీసీ-828, ఎస్సీ-460, ఎస్టీ-229.     

 

1) ట్రేడ్స్ మ్యాన్ మేట్: 2313 పోస్టులు

 

2) ఫైర్‌ మ్యాన్: 656 పోస్టులు       

 

3) జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 99 పోస్టులు       

 

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి

 

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

 

జీత భత్యాలు: ఫైర్ మ్యాన్, జేవోఏ పోస్టులకు రూ.19,900 - రూ.63,200, ట్రేడ్స్ మ్యాన్ పోస్టులకు రూ.18000 - రూ.56,900 ఉంటుంది.

 

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్/ ప్రాక్టికల్/ స్కిల్ పరీక్షలు, రాత పరీక్ష, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

 

దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

 

ప్రకటన తేదీ: 01.09.2022.

 

Website

 

Also Read:

IFGTB Recruitment: ఐఎఫ్‌జీటీబీలో రిసెర్చ్‌ఫెలో ఖాళీలు,అర్హతలివే!

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎఫ్ఆర్ఈ)కు చెందిన కోయంబత్తూర్లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనిటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్(ఐఎఫ్‌జీటీబీ) తాత్కలిక ప్రాతిపదికన వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగ విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

Also Read:

FCI Recruitment 2022: ఎఫ్‌సీఐలో 5 వేలకుపైగా ఉద్యోగాలు!ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్ III,  ఇతరుల దరఖాస్తుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అయితే ఎఫ్సీఐ 2022 రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతం వివరాలు మరియు దరఖాస్తు రుసుము వంటి  అన్ని వివరాల గురించి తెలుసుకోండి.ముఖ్యమైన తేదీలు..* సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. * ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 05 అక్టోబర్ 2022* పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 05 అక్టోబర్ 2022నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.. 

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...