UPSC Civil Services (Main) Examination, 2023 DAF - II: సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2023 పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) డిసెంబరు 8న వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష-2023 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో.. ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో డీటైల్డ్ అప్లికేషన్ ఫాం-2 (DAF-II) నింపాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబరు 15 లోపు డీఏఎఫ్-II సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా డీఏఎఫ్-II అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. డీఏఎఫ్‌లేనిదే ఇంటర్వ్యూకి అనుమతి ఉండదు.
DETAILED APPLICATION FORM-II APPLICATION
దేశవ్యాప్తంగా మొత్తం 2,844 మంది అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి ఎంపికయ్యారు. ఇంటర్వ్యూ తేదీల వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని కమిషన్ పేర్కొంది. మెయిన్స్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 673 మంది వరకు పరీక్షలకు హాజరుకాగా.. 90 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. గతేడాది ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 40 మంది వరకు సివిల్ సర్వీస్ కొలువులకు ఎంపికయ్యారు.
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఎంపికైనవాళ్లకు ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్-2 నింపి, యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రతిభ, మెయిన్స్, ప్రిలిమ్స్ మార్కులను బట్టి ఆలిండియా సర్వీసులకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ ఏడాదికి గాను మొత్తం 1105 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. వీటిల్లో 37 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 16, 17, 18, 24, 25 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అంతకుముందు సివిల్ సర్వీసెస్–2022 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 5న ఉదయం పేపర్-1 (జనరల్ స్డడీస్) పరీక్షను యూపీఎస్సీ నిర్వహించింది. ఈ పేపర్–1 ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం పేపర్–2(అప్టిట్యూడ్ టెస్ట్–సీశాట్)ను 80 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహించారు. జులై 12న ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు మొత్తం 11,845 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక తాజాగా వెల్లడించిన మెయిన్ ఫలితాల్లో 2,844 మంది అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి ఎంపికయ్యారు.
పోస్టుల వివరాలు..
పోస్టుల సంఖ్య: 1105
సర్వీసులు:
➨ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)
➨ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)
➨ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)
గ్రూప్-ఎ:
➨ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్
➨ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్
➨ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్
➨ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్
➨ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్
➨ ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్
➨ ఇండియన్ పోస్టల్ సర్వీస్
➨ ఇండియన్ పీ&టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్
➨ ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్
➨ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ & ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్)
➨ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్‌కం ట్యాక్స్)
➨ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (గ్రేడ్-3)
➨ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్
గ్రూప్-బి:
➨ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్-బి(సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)
➨ ఢిల్లీ, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ సివిల్ సర్వీస్,
➨ ఢిల్లీ, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ పోలీస్ సర్వీస్
➨ పాండిచ్చేరి సివిల్ సర్వీస్
➨ పాండిచ్చేరి పోలీస్ సర్వీస్