UPSC Recruitment: ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య-కుటుంబ సంక్షేశాఖలో స్పెషలిస్ట్ (గ్రేడ్-3) పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 78 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌, ఎం.డీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీతో పాటు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 


వివరాలు..


* స్పెషలిస్ట్ గ్రేడ్-3 పోస్టులు

ఖాళీల సంఖ్య: 78


విభాగాలవారీగా ఖాళీలు..


1) అనస్తీషియాలజీ: 46


పోస్టుల కేటాయింపు: ఎస్సీ-04, ఎస్టీ-06, ఓబీసీ-30, ఈడబ్ల్యూఎస్-01, యూఆర్-05.


అర్హత: గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ (అనస్థీషియాలజీ)/ ఎంఎస్(అనస్థీషియాలజీ))/డిప్లొమా (అనస్థీషియాలజీ) కలిగి ఉండాలి.


అనుభవం: మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత సంబంధిత స్పెషాలిటీలో మూడేళ్ల అనుభవం లేదా మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందిన తర్వాత ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 45 - 50 సంవత్సరాలు మించరాదు. ఈడబ్ల్యూఎస్/యూఆర్ అభ్యర్థులకు 45 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 48 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు మించరాదు.  


2) బయో కెమిస్ట్రీ: 01


పోస్టులకేటాయింపు: ఎస్సీ-01


అర్హత: గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ అనగా ఎండీ(బయో-కెమిస్ట్రీ)/ ఎంఎస్సీ(మెడికల్ బయోకెమిస్ట్రీ)/పీహెచ్‌డీ(బయో-కెమిస్ట్రీ)/ డీఎస్సీ(బయో-కెమిస్ట్రీ) కలిగి ఉండాలి.


అనుభవం: మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత సంబంధిత స్పెషాలిటీలో మూడేళ్ల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: ఎస్సీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు మించరాదు.  


3) ఫోరెన్సిక్‌ మెడిసిన్‌: 07


పోస్టులకేటాయింపు: ఎస్సీ-01, ఓబీసీ-03, యూఆర్-03.


అర్హత: గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ అనగా ఎండీ(ఫోరెన్సిక్ మెడిసిన్) ఉండాలి.


అనుభవం: మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత సంబంధిత స్పెషాలిటీలో మూడేళ్ల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: యూఆర్ అభ్యర్థులకు 45 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 48 సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు మించరాదు.  


4) మైక్రో బయాలజీ: 09


పోస్టులకేటాయింపు: ఎస్సీ-01, ఎస్టీ-01, ఓబీసీ-07.


అర్హత: గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ అనగా ఎండీ(బ్యాక్టీరియాలజీ)/ఎండీ(మైక్రోబయాలజీ)/, ఎంబీబీఎస్‌తో ఎంఎస్సీ(ఎంఈడీ బ్యాక్టీరియాలజీ)/ ఎంఎస్సీ(ఎంఈడీ బాక్టీరియాలజీ)/ఎంఎస్సీ(ఎంఈడీ మైక్రోబయాలజీ)/పీహెచ్‌డీ( మెడ్. బాక్టీరియాలజీ)/ ఎంఎస్సీ.(మెడ్. బాక్టీరియాలజీ)తో డీఎస్సీ(మెడ్. బ్యాక్టీరియాలజీ)/ ఎంఎస్సీ(మెడ్. మైక్రోబయాలజీ) విత్ పీహెచ్‌డీ(మెడ్.  మైక్రోబయాలజీ)/ ఎంఎస్సీ.(మెడ్. మైక్రోబయాలజీ) డీ.ఎస్సీ.(మెడ్. మైక్రోబయాలజీ)/ డీ(బాక్ట్.)/ డిప్లొమా ఇన్ పాథాలజీ & బాక్టీరియాలజీ(డీపీబీ).


అనుభవం: మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత సంబంధిత స్పెషాలిటీలో మూడేళ్ల అనుభవం లేదా మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందిన తర్వాత ఐదేళ్ల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: ఓబీసీ అభ్యర్థులకు 48 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు మించరాదు.  


5) పాథాలజీ: 07


పోస్టులకేటాయింపు: ఎస్సీ-01, ఎస్టీ-01, ఓబీసీ-01, యూఆర్-04.


అర్హత: గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ అనగా ఎండీ(పాథాలజీ)/ పీహెచ్‌డీ(పాథాలజీ)/డీ.ఎస్సీ.(పాథాలజీ)/డిప్లొమా ఇన్ క్లినికల్ పాథాలజీ(డీసీపీ)/డిప్లొమా ఇన్ పాథాలజీ. 


అనుభవం: మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత సంబంధిత స్పెషాలిటీలో మూడేళ్ల అనుభవం లేదా మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందిన తర్వాత ఐదేళ్ల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: యూఆర్ అభ్యర్థులకు 45 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 48 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు మించరాదు.   


6) ప్లాస్టిక్‌ సర్జరీ, రీక‌న్‌స్ట్రక్టివ్‌ స‌ర్జరీ: 08


పోస్టుల కేటాయింపు: ఎస్టీ-01, ఓబీసీ-04, యూఆర్-03.


అర్హత: గుర్తింపు పొందిన ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ అనగా ఎం.సీహెచ్.(ప్లాస్టిక్‌ సర్జరీ)/ఎం.సీహెచ్.(ప్లాస్టిక్‌ & క‌న్‌స్ట్రక్టివ్‌ స‌ర్జరీ).


అనుభవం: మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత సంబంధిత స్పెషాలిటీలో మూడేళ్ల అనుభవం ఉండాలి.


వయోపరిమితి: యూఆర్ అభ్యర్థులకు 45 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 48 సంవత్సరాలు, ఎస్టీ అభ్యర్థులకు 50 సంవత్సరాలు మించరాదు.  


దరఖాస్తు ఫీజు: రూ.25. ఫిమేల్/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


దరఖాస్తు చివరితేది: 11.01.2024.


Notification


Online Application


Website