యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2023 తుది ఫలితాలను తాజాగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 327 ఖాళీల భర్తీకి ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2023 పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, పర్సనాలిటీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 25న రెండు సెషన్లలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. 



ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 401 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థుల నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వలక్షణాలను అంచనా వేయడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.

వివరాలు..

ఎంపికైన అభ్యర్థుల సంఖ్య: 401
విభాగాల వారీగా ఎంపిక..
➥ సివిల్ ఇంజినీరింగ్: 178
పోస్టుల కేటాయింపు: జనరల్: 45, ఈడబ్ల్యూఎస్: 19, ఓబీసీ: 61, ఎస్సీ: 38, ఎస్టీ: 15
➥ మెకానికల్ ఇంజినీరింగ్: 46
పోస్టుల కేటాయింపు: జనరల్: 18, ఈడబ్ల్యూఎస్: 03, ఓబీసీ: 15, ఎస్సీ: 07, ఎస్టీ: 03
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 64
పోస్టుల కేటాయింపు: జనరల్: 24, ఈడబ్ల్యూఎస్: 04, ఓబీసీ: 21, ఎస్సీ: 11, ఎస్టీ: 04     
➥ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 113
పోస్టుల కేటాయింపు: జనరల్: 33, ఈడబ్ల్యూఎస్: 15, ఓబీసీ: 36, ఎస్సీ: 21, ఎస్టీ: 08

యూపీఎస్సీ ఈఎస్ఈ- 2023 తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి.

యూపీఎస్సీ ఈఎస్ఈ- 2023 టాపర్ లిస్ట్..

    రూల్ నెంబరు          పేరు
0800507 వినీత్ జైన్
1501519  సుధాన్షు సింగ్
0804238  సుబాన్ కుమార్ మిశ్రా
0803755  అవంతిక రాథోడ్
0804354 ప్రదీప్ కుమార్
1101811 ఆదిత్య ప్రకాష్ శర్మ
3600097  దేవేంద్ర సాహు
0805861 అనంత్ యాదవ్
0804150 సూర్యకాంత్ శర్మ
0402098 విజయ్ దీక్షిత్

Also Read:

ఐడీబీఐ బ్యాంకులో 2,100 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
IDBI Recruitment: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI Bank) ఒప్పంద ప్రాతిపదికన 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ (JAM, Executive) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 06 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎస్‌బీఐలో 5447 సీబీవో పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

SBI CBO Application: ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో ఖాళీల భర్తీకి నవంబరు 21న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (Circle Based Officer) పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు-5280, బ్యాక్‌లాగ్ పోస్టులు-167 ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 ఖాళీలు ఉన్నాయి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...