యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 11లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష, జూన్ 24, 25 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.



వివరాలు..


కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ - 2023


* మొత్తం పోస్టులు: 285


ఖాళీల వివరాలు..


కేటగిరీ-1: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-గనుల మంత్రిత్వ శాఖ - 256 పోస్టులు


1) జియాలజిస్ట్, గ్రూప్-ఎ: 216 పోస్టులు


2) జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ: 21 పోస్టులు


3) కెమిస్ట్, గ్రూప్-ఎ: 19 పోస్టులు



కేటగిరీ-2:  సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్- జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖ
- 29 పోస్టులు


1) సైంటిస్ట్ బి (హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ: 26 పోస్టులు


2) సైంటిస్ట్ బి  (కెమికల్), గ్రూప్-ఎ: 01 పోస్టు


3) సైంటిస్ట్ బి  (జియోఫిజిక్స్) గ్రూప్-ఎ: 02 పోస్టులు


అర్హత: మాస్టర్ డిగ్రీ(జియోలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్‌ప్లోరేషన్/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ(టెక్)- అప్లైడ్ జియోఫిజిక్స్.


వయోపరిమితి: 1.1.2023 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ/ ప‌ర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా.


పరీక్ష విధానం: స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), స్టేజ్ 2-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, దిల్లీ, దిస్పూర్, హైదరాబాద్, జైపుర్, జమ్ము, కోల్‌కతా, లఖ్‌నవూ,


ముంబయి, పట్నా, ప్రయాగ్ రాజ్(అలహాబాద్), షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం.

ముఖ్యమైన తేదీలు


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.10.2022.


దరఖాస్తుల ఉపసంహరణ: 19.10.2022 నుంచి 25.10.2022 వరకు


ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 19.02.2023.


మెయిన్ పరీక్ష తేదీలు: 25.06.2023


Notification


Online Application


Website


 



ఇవి కూడా చదవండి:


UPSC: యూపీఎస్సీ నుంచి 54 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు ఇవే!
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 43 లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు, సైంటిస్ట్ ‘బి’ (ఫోరెన్సిక్ డీఎన్‌ఏ) విభాగంలో 6 పోస్టులు, ఇతర విభాగాల్లో ఒక్కో పోస్టుల చొప్పున భర్తీ చేస్తారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


UPSC:  ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...