సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2022 పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో విడుదల కానున్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు విడులయ్యాక తమ లాగిన్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించిన తర్వాత అనుసరించవల్సిన విధివిధానాలకు సంబంధించి యూపీఎస్సీ నవంబరు 24న ఒక ప్రకటన విడుదల చేసింది.


డీఏఎఫ్‌-II నింపాల్సిందే..


సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష-2022 ఫలితాలు విడుదలైన తర్వాత అర్హత సాధించిన వారికి యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌‌లో డీటైల్డ్‌ అప్లికేషన్‌ ఫాం-2 (డీఏఎఫ్‌-II) అందుబాటులో ఉంటుందని, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసుకోవల్సి ఉంటుందని ఈ మేరకు సూచించింది.


సివిల్‌ సర్వీసెస్‌ నియామక ప్రక్రియలో.. మెయిన్స్‌ రాత పరీక్షల అనంతరం పర్సనల్ టెస్ట్‌/ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. వీటికి హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా డీఏఎఫ్‌-II అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. డీఎఫ్‌లేనిదే ఇంటర్వ్యూకి అనుమతి ఉండదు.


ఇవి తప్పనిసరి..


మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెట్రిక్యులేషన్ (టెన్త్ సర్టిఫికేట్), హయ్యర్ సెకండరీ (ఇంటర్), డిగ్రీ, ఇతర అన్ని ఓరిజినల్‌ డాక్యుమెంట్లతోపాటు, ఫొటోకాఫీలను కూడా సిద్ధం చేసుకోవాల్సిందిగా ప్రకటనలో పేర్కొంది. మెయిన్స్‌ ఫలితాలు ప్రకటన అనంతరం ఇంటర్వ్యూ తేదీలు తెలియజేస్తామని వివరించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిన్ జూన్ 25న 72 నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను జూన్ 22న వెల్లడించింది.


ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 16 నుండి 25 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి 673 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.


యూపీఎస్‌సీ ఈ ఏడాది 1011 ఖాళీల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది కంటే ఈసారి 300 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే 2021లో ప్రకటించిన ఖాళీలు చాలా తక్కువ. సివిల్ సర్వీసెస్ పరీక్ష నుంచి రైల్వే సర్వీసెస్‌ను తొలగించడం వల్ల ఇలా ఖాళీల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం వాస్తవంగా ప్రకటించిన ఖాళీలు 861. ఆ తర్వాత రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కు చెందిన 150 ఖాళీలను ప్రభుత్వం జోడించడంతో మొత్తం 1011 ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో గతేడాదితో పోలిస్తే ఖాళీలు 42 శాతం పెరిగాయి.



-------------------------------------------------------------------------------------------------------------


Also Read:


నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 'గ్రూప్స్‌'లో మరిన్ని కొలువులు!
నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు పూర్తి కాగా, త్వరలో గ్రూప్‌-2, 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. రాబోవు నోటిఫికేషన్లలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 కేటగిరీల్లో మరిన్ని పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ సవరించింది. ఇందుకు సంబంధించి గురువారం (నవంబరు 24న) ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రూప్-2లో 6, గ్రూప్-3లో 2, గ్రూప్-4లో 4 రకాల పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రూప్‌-2, 3, 4లో పోస్టులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


నవోదయ విద్యాలయ సమితిలో 2,200 టీచర్ పోస్టుల భర్తీ - రాత పరీక్ష షెడ్యూలు వెల్లడి!
వోదయ విద్యాలయ సమితిలో 2200 పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలు విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 28 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను నవంబరు 25 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...