సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 31 నుంచి నవంబరు 22 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఇంటర్వ్యూలు జరగుతాయి.


ఇంటర్వ్యూలకు మొత్తం 454 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఏ అభ్యర్థికి ఏరోజు ఇంటర్వ్యూ ఉంటుందో షెడ్యూలులో అందుబాటులో ఉంచారు. ఇంటర్వ్యూ అభ్యర్థుల మెడికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఈ-సమ్మన్ లెటర్లను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు ఈసమ్మన్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. ఇంటర్వ్యూరోజు తప్పనిసరిగా ఈ లెటర్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థులకు న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబరు 31  నుంచి నవంబరు 22 వరకు.

ఇంటర్వ్యూ వేదిక:
Union Public Service Commission, 
Dholpur House, Shahjahan Road, 
New Delhi-110069

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

❂ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.

❂ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ-సమ్మన్ లెటర్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.

❂ రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను కూడా తీసుకెళ్లాలి.

❂ అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత ధ్రువపత్రాలు, ఒక జత జిరాక్స్ కాపీలు, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

❂ విమానంలో ఢిల్లీ చేరుకోదలచిన అభ్యర్థులకు విమానఛార్జీలను చెల్లిస్తారు. అయితే యూపీఎస్సీ పేర్కొ్న్న ట్రావెల్ ఏజెంట్ల వద్దనే ఎకానమీ టికెట్లు కొనాల్సి ఉంటుంది. టికెట్ల హార్డ్ కాపీ/ప్రింటవుట్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది.
-అశోక టూర్స్ & ట్రావెల్
- బామర్ లారై
- ఐఆర్‌సీటీసీ

❂ అదేవిధంగా సెకండ్/స్లీపర్ క్లాస్ ట్రైన్ ద్వారా ప్రయాణించినవారు కూడా రీయింబెర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

❂ అభ్యర్థులు తమ ప్రయాణానికి కనీసం 21 రోజుల ముందుగా విమాన టికెట్లు, తిరుగు ప్రయాణ టికెట్లను కూడా బుక్ చేసుకోవాలి. కనీసం 72 గంటల ముందుగా బుక్ చేసుకోవడం మంచిది.

❂ ఏదైనా విమాన టిక్కెట్ బుకింగ్ 72 గంటలలోపు చేయబడుతుంది. ముందు ఉద్దేశించిన ప్రయాణం, చెల్లుబాటు అయ్యే కారణాలతో సమర్థించబడకపోతే, తిరిగి చెల్లించబడదు.

❂ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

❂ సోషల్ డిస్టెన్స్, వ్యక్తిగత పరిశుభ్రత, తరచుగా చేతులు కడగటం, శానిటైజర్ వినియోగం, మాస్కులు ధరించడం తప్పనిసరి.



 


:: Also Read ::


SSC MTS Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ 'టైర్-1' ఫలితాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!
కేంద్రప్రభుత్వ విభాగాల్లో మల్టీటాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి నిర్వహించిన టైర్-1 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 8న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎంటీఎస్ టైర్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.  మల్టీటాస్కింగ్ స్టాఫ్ టైర్-1 పరీక్షలో మొత్తం 69,160 మంది అభ్యర్థులు టైర్-2 పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 44,590 మంది అభ్యర్థుల మల్టీటాస్కింగ్ పోస్టులకు; 24,570 మంది అభ్యర్థులు హవల్దార్ పోస్టులకు సంబంధించి తదుపరి దశకు ఎంపికైన అభ్యర్థులు ఉన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 5 నుంచి 22 వరకు ఎంటీఎస్ (నాన్ టెక్నికల్) టైర్-1 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల స్కోరుకార్డులను అక్టోబరు 17 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. నవంబరు 6 వరకు స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఐడీకార్డు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు పొందవచ్చు.
ఎంటీఎస్ ఫలితాల కోసం క్లిక్  చేయండి..


SSC CGLE 2022: సీజీఎల్ఈ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022' దరఖాస్తు గడువును అక్టోబరు 13 వరకు పొడిగిస్తూ స్థాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి అక్టోబరు 8తో ముగియాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మరో వారంపాటు పొడిగించింది. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు అక్టోబరు 13లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 14 వరకు, చలనా ద్వారా అక్టోబరు 15 వరకు అవకాశం కల్పించారు. ఇక దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే అక్టోబరు 19, 20 తేదీల్లో సరిచేసుకోవచ్చు.
పొడిగించిన పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి...


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...