యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 76 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  


వివరాలు..


మొత్తం ఖాళీలు: 76.


1. ప్రొఫెసర్లు: 21 పోస్టులు


2. అసోసియేట్ ప్రొఫెసర్లు: 33 పోస్టులు


3. అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 17 పోస్టులు


విభాగాలు: సైన్సెస్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ అండ్‌ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్ స్టడీస్.


అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం కలిగి ఉండాలి.


వయోపరిమితి: 65 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక ప్రక్రియ: అభ్యర్థి అకడమిక్‌ రికార్డు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 


జీత భత్యాలు: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200; అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100; అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి రూ.1,82,400.


దరఖాస్తు హార్డ్‌కాపీలు పంపాల్సిన చిరునామా: DEPUTY REGISTRAR (RECRUITMENT)
RECRUITMENT CELL, ROOM No: 221, (First Floor),
ADMINISTRATION BUILDING
UNIVERSITY OF HYDERABAD
PROF. C R RAO ROAD
GACHIBOWLI, HYDERABAD – 500 046


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31.05.2023.


➥ దరఖాస్తు హార్డ్‌కాపీ పంపడానికి చివరి తేదీ: 09.06.2023.


Notification 



Website 


Also Read:


పాలిటెక్నిక్‌ లెక్చరర్‌, పీడీ పోస్టుల రాతపరీక్షల తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్లు, సాంకేతిక, ఇంటర్మీడియట్‌ విద్యలో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి మే నెలలో నిర్వహించనున్న రాతపరీక్షల తేదీల్లో టీఎస్‌పీఎస్సీ మార్పులు చేసింది.  ఈ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారితంగా (సీబీఆర్‌టీ) సెప్టెంబరు 4, 5, 6, 8, 11 తేదీల్లో సంబంధిత సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు కమిషన్‌ పరీక్షల షెడ్యూలు జారీ చేసింది. పాలిటెక్నిక్‌ కళాశాలలో 247 లెక్చరర్‌ పోస్టులకు సాంకేతిక, ఇంటర్‌ విద్యలో 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తొలుత కమిషన్‌ తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం సాధ్యమైనన్ని పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టులకు సీబీఆర్‌టీ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను వెల్లడించింది.
పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 428 ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 428 ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..