UIICL Administrative Officers: యునైటెడ్‌ ఇండియా ఇన్య్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ (UIIC Ltd.) అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్ (AO Posts)  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు జనవరి 8 నుంచి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. 


వివరాలు..


* అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (జనరలిస్ట్) పోస్టులు


ఖాళీల సంఖ్య: 250


పోస్టుల కేటాయింపు: యూఆర్-102, ఈడబ్ల్యూఎస్-24, ఓబీసీ-67, ఎస్టీ-20, ఎస్సీ-37.


అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి ఉండాలి.


వయోపరిమితి: 31.12.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 01.01.1994 - 31.12.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, డిఫెన్స్ సర్వీస్ పర్సనల్స్‌కు 3 సంవత్సరాలు, వితంతు-ఒంటరి మహిళలకు 9 సంవత్సరాలు, ప్రభుత్వరంగ బీమా సంస్థల్లో పనిచేస్తున్నవారికి 8 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: రూ.50,925 - రూ.96,765 (బేసిక్‌పేతో కలిపి), ఇతర భత్యాలు అదనంగా ఉంటాయి.


పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వే్జ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలు-40 మార్కులు, కంప్యూటర్ లిటరసీ 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇక తెలంగాణలో హైదరాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో పరీక్ష నిర్వహిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.01.2024.


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 23.01.2024.


➥ దరఖాస్తుల సవరణకు చివరితేది: 23.01.2024.


➥ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 07.02.2024.


➥ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు తేదీలు:  08.01.2024 - 23.01.2024.


➥ ఆన్‌లైన్ రాతపరీక్ష: ఫిబ్రవరిలో.


Notification


Online Application


Website



ALSO READ:


భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 81 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ & బీకామ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సదరన్‌ రీజియన్‌ (తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి) ప్రాంతానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీకాం ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 10వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిఉంటుంది.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...