ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 మెయిన్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో విడుదల చేసిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల నెంబర్లతో, అభ్యర్థుల పేర్లతో వేర్వేరుగా ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 25న మెయిన్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
Engineering Services (Main) Exam Results
Engineering Services (Main) Exam Results (with name)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను గతేడాది సెప్టెంబరు 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని 327 ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. మార్చి 3న ఫలితాలను వెల్లడించారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 25న మెయిన్ పరీక్ష నిర్వహించారు. తాజాగా వీటి ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది.
ALSO READ:
సీహెచ్‌ఎస్‌ఎల్-2022 'టైర్-2' ఫలితాలు విడుదల- 3,242 అభ్యర్థులు ఎంపిక
కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 4,500 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్-2022 టైర్-2 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. టైర్-2 ఫలితాల్లో మొత్తం 3,242 అభ్యర్థులు ఎంపికయ్యారు. జూన్ 26న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ టైర్-2 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..