కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు, ఇతర అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జులై 8న ప్రారంభంకాగా.. జులై 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల మేరకు ఎంపిక విధానం ఉంటుంది.


వివరాలు...


1) లీగల్ ఆఫీసర్: 02 పోస్టులు
అర్హత: లా డిగ్రీ. 
అనుభవం: కనీసం 3 సంవత్సరాల లీగల్ ప్రాక్టీస్ ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు.


2) సైంటిఫిక్ ఆఫీసర్ (కెమికల్): 01 పోస్టులు
అర్హత: మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ) లేదా డిగ్రీ (కెమికల్ టెక్నాలజీ/ కెమికల్ ఇంజినీరింగ్).
అనుభవం: అనలిటికల్/కెమికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ/ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ వర్క్/ అనాలిసిస్ ఆఫ్ ఓర్స్, మినరల్స్, మెటల్స్/ ఆయిల్ & ఫ్యూయల్ అండ్ ఆర్గానిక్, ఇనార్గిక్ ప్రొడక్ట్స్ విభాగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు.


3) డిప్యూటీ ఆర్కిటెక్ట్: 53 పోస్టులు
అర్హత: డిగ్రీ (ఆర్కిటెక్ట్). 
వయోపరిమితి: 35 సంవత్సరాలు.
 
4) సైంటిస్ట్-బి (బాలిస్టిక్స్): 01 పోస్టులు
అర్హత: మాస్టర్ డిగ్రీ (మ్యాథమెటిక్స్/ఫోరెన్సిక్ సైన్స్). డిగ్రీలో ఫిజిక్స్/మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
అనుభవం: అనలిటికల్ మెథడ్స్ అండ్ రిసెర్చ్ విభాగాల్లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు.


5) సైంటిస్ట్-బి (డాక్యుమెంట్స్): 06 పోస్టులు
అర్హత: మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ/ఫిజిక్స్/ఫోరెన్సిక్ సైన్స్). డిగ్రీలో కెమిస్ట్రీ/ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
అనుభవం: అనలిటికల్ మెథడ్స్ అండ్ రిసెర్చ్ విభాగాల్లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు.


6) జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (టాక్సికాలజీ): 02 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (కెమిస్ట్రీ) లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి అసోసియేట్‌షిప్ డిప్లొమా/బయోకెమిస్ట్రీ/ఫార్మకాలజీ/ఫోరెన్సిక్ సైన్స్. డిగ్రీ స్థాయిలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
అనుభవం: టాక్సికాలజీకి సంబంధించి అనలిటికల్ మెథడ్స్ అండ్ అనలిటికల్ వర్క్ విభాగాల్లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు.


7) అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (ఆక్యుపేషనల్ హెల్త్) గ్రేడ్-1: 02  పోస్టులు
అర్హత: పీజీ డిగ్రీ (కమ్యూనిటీ మెడిసిన్)/ పీజీ డిప్లొమా (ఇండస్ట్రియల్ హెల్త్/ఆక్యుపేషనల్ హెల్త్/పబ్లిక్ హెల్త్)
అనుభవం: కనీసం 2-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు.


8) డైరెక్టర్ జనరల్: 01 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 30  సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 58 సంవత్సరాలు.


9) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 03 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
అనుభవం: కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు.


ముఖ్యమైన తేదీలు..


➛ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.07.2023.


➛ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:  27.07.2023. (23:59)


➛ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 28.07.2023. 


Notification


Online Application


Website


ALSO READ:


ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్- 55వ కోర్సు, వివరాలు ఇలా!
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 55వ కోర్సుకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీసీ- సి సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎయిమ్స్‌ భువనేశ్వర్‌లో 775 గ్రూప్ బి, సి పోస్టులు, అర్హతలివే!
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) వివిధ గ్రూప్ బి, సి (నాన్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 1045 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్‌) 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్‌ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణత గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 31 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial