UCO Bank Recruitment of Local Bank Officer: కోల్‌కతా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (UCO Bank) లోకల్ బ్యాంకు ఆపీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 10 పోస్టులను తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. యూకో బ్యాంకు ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగాలకు ఎంపికైతే మాత్రం ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరాకా.. వారిని ఫ్రెషర్స్‌గానే పరిగణిస్తారు.
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్(స్కేల్-1) కింద నెలకు రూ.48,480 - రూ.85,920 వరకు జీతంగా ఇస్తారు.
వివరాలు..
* లోకల్ బ్యాంకు ఆపీసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 250
పోస్టుల కేటాయింపు: యూఆర్-121, ఈడబ్ల్యూఎస్-21, ఓబీసీ-63, ఎస్టీ-14, ఎస్సీ-31.
రాష్ట్రాల వారీగా ఖాళీలు..
1. గుజరాత్: 57
2. మహారాష్ట్ర: 70
3. అస్సాం: 30
4. కర్ణాటక: 35
5. త్రిపుర: 13
6. సిక్కిం: 06
7. నాగాలాండ్: 05
8. మేఘాలయ: 04
9. కేరళ: 15
10. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్: 10
11. జమ్మూ-కశ్మీర్: 05
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. పనిచేసే రాష్ట్రాల్లోని స్థానిక భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 155 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 ప్రశ్నలు-60 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వే్జ్ 35 ప్రశ్నలు-40 మార్కులు, డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రిటేషన్ 35 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో అనంతపురం, విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్/సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నర్సంపేట.
జీతం: నెలకు రూ.48,480-రూ.85,920 వరకు ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.01.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.02.2025.
➥ ఫీజు చెల్లింపు తేదీలు: 16.01.2025 - 05.02.2025.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 05.02.2025.
➥ దరఖాస్తులు ప్రింట్ తీసుకోవడానికి చివరితేదీ: 20.02.2025.
ALSO READ:
ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంకులో 251 అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులుఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(APCOB) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 251 అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోని డిస్ట్రిక్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫీజు జనరల్/బీసీ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..