TTWREIS Recruitment: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.   


వివరాలు..


లెక్చరర్- ఫ్యాషన్ డిజైన్‌


లెక్చరర్- ఇంటీరియర్ డిజైన్‌


లెక్చరర్- ఫొటోగ్రఫీ


లెక్చరర్- కంప్యూటర్ సైన్స్


అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: నిబంధనల మేరకు.


దరఖాస్తు ఫీజు: రూ.500.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: నిబంధనల మేరకు. 


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.10.2023. 


Notification   


Website


ALSO READ:


ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఆర్‌టీలో 78 టెక్నికల్, ల్యాబొరేటరీ అటెండెంట్‌ ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యుబర్‌క్యులోసిస్‌' గ్రూప్‌ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎయిమ్స్‌-కళ్యాణిలో 120 గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 51 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు, వివరాలు ఇలా
గువాహటి మాలిగావ్‌లోని నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే వివిధ క్రీడాంశాల్లో స్పోర్ట్స్ పర్సన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజేతలైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..