తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో 1601 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని సంస్థ సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. వీటిలో 1553 జూనియర్‌లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
మంత్రి జగదీశ్ వెల ప్రస్తుత రబీ సీజన్, రాబోయే ఎండాకాలంలో నిరంతర విద్యుత్తు సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్తు సంస్థలు తీసుకుంటున్న చర్యలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఏటా రికార్డుస్థాయిలో విద్యుత్తు డిమాండ్ నమోదవుతోందన్నారు. గతేడాది రబీ సీజన్‌లో 14160 మెగావాట్లకు చేరిందన్నారు. ఎన్నడూ లేనిరీతిలో గత డిసెంబరు 30న సైతం 14017 మెగావాట్లు నమోదవ్వడం గుర్తించాలన్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా రాబోయే వేసవిలో 15,500 మెగావాట్ల డిమాండ్‌కు అవకాశముందన్నారు.
విద్యుత్ ఉద్యోగులకు పీఆర్‌సీ త్వరలో..
తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల ఐకాస(టీఈఈజాక్) కన్వీనర్ ఎన్ శివాజీ నేతృత్వంలో పలువురు మంత్రిని కలిసి పీఆర్సీపై విన్నవించారు. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మార్పు, ట్రాన్స్‌కో, జెన్‌కోలలో 166 మంది ఇంజినీర్ల రివర్షన్ అంశాలనూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రివర్షన్ అయిన వారిని సర్దుబాటు చేయడానికి ఉన్న అవకాశాలను వివరించారు. మంత్రి మాట్లాడుతూ విద్యుత్తు ఇంజినీర్లలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వబోమని తెలిపారు. సీఎండీ ప్రభాకర్ రావుతో చర్చించి అన్ని విషయాలు సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు.
Also Read:
పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 40 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 40,889 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించిన టీఎస్ పీఎస్సీ తాజాగా మంగళవారం నాడు మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది. ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మల్టీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది.
మెయిన్స్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..