TSSPDCL Jobs Notification: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ - TSSPDCL)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అయింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ (TSSPDCL) లో 1,271 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఇందులో 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌), 201 సబ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌), వెయ్యి జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులు 1000 ఉన్నాయి. విద్యార్హతలు, వయసు పరిమితి, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలతో నియామకానికి సంబంధించిన ప్రకటనను ఈ నెల 11న సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ tssouthernpower.cgg.gov.in లేదా www.tssouthernpower.comలో చూడవచ్చు. ఈ మేరకు TSSPDCL వివరాలు వెల్లడించింది.


TSSPDCL Recruitment 2022: ముఖ్యమైన తేదీలు
* నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 9
* డీటైల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ తేదీ: మే 11
* ఆన్ లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మొదలయ్యే తేదీ: మే 11


TSSPDCL Recruitment 2022: ఖాళీల వివరాలు
* అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 70
* సబ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 201
*  జూనియర్ లైన్ మ్యాన్: 1000
మొత్తం: 1271 


TSSPDCL Recruitment 2022: ఎలా దరఖాస్తు చేయాలంటే
* టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ (TSSPDCL) అధికారిక వెబ్ సైట్ tssouthernpower.cgg.gov.in సందర్శించాలి
* హోం పేజీలో కనిపించే కెరీర్/రిక్రూట్ మెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి
* అందులో కనిపించే అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకొని అన్ని నిబంధనలు చదవాలి
* అందులో ఉన్న నిబంధనల మేరకు తప్పులు లేకుండా అన్ని వివరాలు ఎంటర్ చేయాలి
* చివరిగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.


టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ TSNPDCL లోనూ త్వరలో నోటిఫికేషన్


త్వరలో ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSNPDCL), తెలంగాణ జెన్‌కో (Telangana Genco) సంస్థల నుంచి కూడా త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Jobs in Telangana Genco) విడుదల కానుంది. ఏఈతోపాటు ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్‌ ప్లాంట్ల నిర్వహణకు తెలంగాణ జెన్‌కో (Telangana Genco) దాదాపు 200 ఏఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఓ మూడు, నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


Also Read: యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్షా ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి


Also Read: SBI Recruitment 2022: 35 పోస్టులతో ఎస్‌బీఐ నోటిఫికేషన్- అప్లై చేయడానికి మే 17 లాస్ట్ డేట్