TSRTC Recruitment: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్ల(డిపో/యూనిట్‌)లో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ (బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం ఖాళీల్లో 25 శాతం (38 పోస్టులు) బీసీలకు కేటాయించారు. ఎస్సీలకు 1:16 నిష్పత్తిలో, ఎస్టీలకు 1:16 నిష్పత్తిలో ఎస్టీలకు కేటాయించారు. 

వివరాలు..

* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 150.

శిక్షణ కాలం: 3 సంవత్సరాలు.

రీజియన్లవారీగా ఖాళీలు..

➥ హైదరాబాద్ రీజియన్‌: 26

➥ సికింద్రాబాద్ రీజియన్‌: 18

➥ మహబూబ్‌నగర్ రీజియన్‌: 14

➥ మెదక్ రీజియన్‌: 12

➥ నల్గొండ రీజియన్: 12

➥ రంగారెడ్డి రీజియన్‌: 12

➥ ఆదిలాబాద్ రీజియన్: 09

➥ కరీంనగర్ రీజియన్: 15

➥ ఖమ్మం రీజియన్: 09

➥ నిజామాబాద్ రీజియన్: 09

➥ వరంగల్ రీజియన్‌: 14

అర్హత: 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యాసంవత్సరంలో బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వయోపరిమితి: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: అప్రెంటిస్ వెబ్‌సైట్‌(NATS)లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఎంపిక విధానం: విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టైపెండ్: మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000 చెల్లిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.02.2024. 

Notification

Website

Apprentice Website

ALSO READ:

TSRTC తార్నాక నర్సింగ్ కళాశాలలో ఉద్యోగాలు, వాక్ఇన్ వివరాలు ఇలాTSRTC Nursing College Recruitment: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ తార్నాకాలోని నర్సింగ్ కళాశాలలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఒప్పంద ప్రాతిపదికన వైస్ ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం, వేతనం తదితర అంశాలు నిర్ణయించారు. వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. సరైన అర్హతలున్నవారు జనవరి 23న తార్నాకాలోని ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అభ్యర్థులు అవసరమైన అన్ని విద్యార్హత ధ్రువపత్రాలు, వాటి జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.  వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు ఎంఎస్సీ (నర్సింగ్) అర్హతతో 12 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 10 సంవత్సరాల టీచింగ్ (అబ్‌స్టేట్రిక్స్, పీడియాట్రిక్ నర్సింగ్) అనుభవం ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంఎస్సీ (నర్సింగ్) అర్హతతో 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 5 సంవత్సరాల టీచింగ్ (అబ్‌స్టేట్రిక్స్, పీడియాట్రిక్ నర్సింగ్) అనుభవం ఉండాలి. ఇక ట్యూటర్ పోస్టులకు బీఎస్సీ (నర్సింగ్) లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌ అర్హతతో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.  నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..