తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ 8న నోటిఫికేషన్ (నెం.21/2022) వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబర్ 16న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్స్/ఫార్మా-డి (లేదా) గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి మెడిసిన్ (క్లినికల్ ఫార్మకాలజి/మైక్రోబయాలజి) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

పోస్టుల వివరాలు..

డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు

🔰 ఖాళీల సంఖ్య: 18

అర్హత:  బీఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్స్/ఫార్మా-డి (లేదా) గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి మెడిసిన్ (క్లినికల్ ఫార్మకాలజి/మైక్రోబయాలజి) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2022  నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.2004 - 02.07.1978 మధ్య జన్మించి ఉండాలి.  నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ;నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజుమాత్రం చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా. 

పేస్కేల్: రూ.51,320– రూ.1,27,310.

పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షవిధానంమొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 16.12.2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 05.01.2023
ఫీజు చెల్లించడానికి చివరితేది 05.01.2023
పరీక్ష తేది మే/జూన్ 2023.

Notification 

Online Application

Website

Also Read:

పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో వైద్య విద్యపూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి డిసెంబరు 20న ఉద‌యం 10:30 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 5న సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!
హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ విభాగం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ, ఎల్ఎల్‌బీ/ఎల్ఎల్ఎం ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 15లోగా దరఖాస్తులు సమర్పించవలెను.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...