TSPSC VAS Results: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (Veterinary Assistant Surgeon) పోస్టుల రాత పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ, క్లాస్-బి) పరీక్షకు హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను అందుబాటులో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) చేపట్టనున్నారు. ఫలితాలకు సంబంధించి క్లాస్-ఎ విభాగంలో 786 మంది అభ్యర్థులు, క్లాస్-బి విభాగంలో 101 మంది అభ్యర్థుల మార్కుల జాబితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ) జనరల్ ర్యాంకింగ్ లిస్ట్
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి) జనరల్ ర్యాంకింగ్ లిస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ 2022, డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో క్లాస్-ఎ విభాగంలో 170 పోస్టులు, క్లాస్-బి విభాగంలో 15 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 – రూ.1,33,630 జీతంగా ఇస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు. జులై 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరిగాయి.
పరీక్ష విధానం:
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (వెటర్నరీ సైన్స్-డిగ్రీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నలకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
ALSO READ:
TSPSC 'గ్రూప్-1' దరఖాస్తుల సవరణ ప్రారంభం - ఎప్పటివరకు అవకాశమంటే?
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు వివరాల్లో తప్పుల సవరణ ప్రక్రియ మార్చి 23న ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక లింక్‌ను టీఎస్‌పీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు మార్చి 27న సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు మార్చుకోవచ్చు. వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ వివరాలు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిల్ లేదా నేరుగా వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోరు. సవరించిన అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఒక్కసారి వివరాలు సవరించుకున్న తర్వాత అభ్యర్థులు క్షుణ్నంగా పరిశీలించుకోవాలి. సమర్పించిన తర్వాత మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు. అభ్యర్థులు తమ పేరు, పుట్టినతేదీ, జెండర్, విద్యార్హతలు, ఫోటో, సంతకం తదితర వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
వివరాల్లో మార్పు కోసం క్లిక్ చేయండి..