తెలంగాణలో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (TPBO) పోస్టుల రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందువరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం టీపీబీవో పోస్టుల భర్తీకి జులై 8న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు. జులై 8న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి గతేడాది సెప్టెంబరు 7న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. మొదట జనవరిలోనే రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కుదరకపోవడంతో మార్చి 12న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్ష మరోసారి వాయిదాపడింది. దీంతో జులై 8న పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.32,810 - రూ.96,890 జీతంగా ఇస్తారు.


పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రెండు విభాగాల నుంచి 300 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, అభ్యర్థి సంబంధిత సబ్జెక్ట్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు. 



ALSO READ:


ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్‌ఈఎస్‌) 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోధనతో పాటు రెసిడెన్షియల్‌ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్‌ ప్రాతిపదికన బోర్డింగ్‌, లాడ్జింగ్‌ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 02వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.  పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్‌డీ, ఎంఫిల్, ఎంఈడీ, టెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధననానుభవం కలిగి ఉండాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial