తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో గెజిటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 6 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 2023 మార్చి లేదా ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు.
పోస్టుల వివరాలు..
* గెజిటెడ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 32
1) అసిస్టెంట్ హైడ్రోమెటియోరాలజిస్ట్: 01
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (మెటియోరాలజి/ఫిజిక్స్/మ్యాథమెటిక్స్/అప్లయిడ్ సైన్స్).
జీతం: రూ.45,960 – రూ.1,24,150.
2) అసిస్టెంట్ కెమిస్ట్: 04
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీ) లేదా డిగ్రీ (కెమికల్ ఇంజినీరింగ్/కెమికల్ టెక్నాలజీ).
జీతం: రూ.45,960 – రూ.1,24,150.
3) అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్: 06
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (జియోఫిజిక్స్).
జీతం: రూ.54,220 – రూ.1,33,630.
4) అసిస్టెంట్ హైడ్రోజియోలజిస్ట్: 16
అర్హత: జియోలజీ/ అప్లయిడ్ జియోలజీ/హైడ్రోజియోలజీ విభాగాల్లో ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ (లేదా) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ధన్‌బాద్ నుంచి డిప్లొమా అసోసియేట్‌షిప్ (అప్లయిడ్ జియోలజీ) ఉండాలి.
జీతం: రూ.54,220 – రూ.1,33,630.
5) అసిస్టెంట్ హైడ్రోలజిస్ట్: 05
అర్హత: డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) ఉండాలి. డిగ్రీలో జియోలజీ ఒక సబ్జెక్టుగా కచ్చితంగా చదివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ నిర్వహించే ఏఎంఐఈ ఎగ్జామినేషన్‌లో సెక్షన్ ఎ, బి ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ.54,220 – రూ.1,33,630.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 01.07.2004 - 02.07.1978 మధ్య జన్మించి ఉండాలి.
ఫీజు వివరాలు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నవారు పరీక్ష ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 300 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు - 150 మార్కులు, పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు - 300 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 తెలుగు, ఇంగ్లిష్‌లో; పేపర్-2 కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు...
ముఖ్యమైన తేదీలు..
🔰ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.12.2022.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.12.2022.
Also Read:
తెలంగాణలో 'గ్రూప్-4' ఉద్యోగాల జాతర - 9,168 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ జారీచేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 9,168 గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
TS: 12 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు ఇవే!
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్-2,3,4 పోస్టులకు మరికొన్ని పోస్టులను చేర్చిన ప్రభుత్వం,తాజాగా గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి 9వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాష్ట్రంలోని గురుకులాల్లోనూ భారీగా పోస్టుల సంఖ్య పెరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో ప్రభుత్వం ఇప్పటికే అనుమతించిన 9,096 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు అదనంగా దాదాపు 3 వేల పోస్టులు రానున్నాయి.
పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..