తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 18, 19 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. 


పేపర్ – I పరీక్ష: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ అన్నీ పోస్టులకు జులై 18న ఉదయం సెషనల్లో నిర్వహిస్తారు. 


పేపర్ – II పరీక్ష: అభ్యర్థుల సంబంధిత సబ్జెక్ట్/నీటి వనరులు అసిస్టెంట్ హైడ్రో మెటియోరాలజిస్ట్ పోస్టుకు జులై 18న మధ్యాహ్నం నిర్వహిస్తారు. అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులకు జులై 19న మధ్యాహ్నం పరీక్ష నిర్వహిస్తారు. ఇక అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ పోస్టులకు జులై 19న ఉదయం పరీక్ష నిర్వహిస్తారు. 


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 300 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు - 150 మార్కులు, పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు - 300 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 తెలుగు, ఇంగ్లిష్‌లో; పేపర్-2 కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.


ALSO READ:


ప్రశాంతంగా ముగిసిన వెటర్నరీ అసిస్టెంట్‌ రాతపరీక్ష, 62 శాతం హాజరు!
తెలంగాణలోని పశుసంవర్థకశాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ క్లాస్‌-ఎ, క్లాస్‌-బి పోస్టుల భర్తీకి జులై 13, 14 తేదీల్లో నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం(జులై 14) ఒక ప్రకటనలో తెలిపింది. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ క్లాస్‌-ఎ పోస్టులకు 73.50 శాతం అభ్యర్థులు హాజరుకాగా, క్లాస్‌-బి పోస్టులకు 50.99 శాతం హాజరు నమోదైనట్లు కమిషన్ పేర్కొంది. జులై 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మ‌ల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial