ఉమెన్ డెవలప్‌మెంట్ & ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టుల భర్తీకి జనవరి 8న నిర్వహించిన రాతపరీక్ష ఆన్సర్ కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ వెల్లడించింది. ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలను కూడా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 33,405 మంది అభ్యర్థుల డిజిటల్ జవాబు పత్రాలను అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 21 వరకు ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు జనవరి 21 నుంచి 24న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక లింకును టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. గడువులోపు నమోదుచేసిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 


ఆన్సర్ కీ, క్వశ్చన్ పేపర్ల కోసం క్లిక్ చేయండి...


అభ్యర్థుల OMR షీట్ల కోసం క్లిక్ చేయండి..


ఆన్సర్ కీపై అభ్యంతరాల కోసం క్లిక్ చేయండి..


ప్రత్యేక లింక్ ద్వారానే అభ్యంతరాలు...


➦ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన వెబ్‌లింక్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది.


➦ ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అభ్యర్ధులు అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్స్ లేదా ఇతర రాతపూర్వక మార్గాల్లో అభ్యంతరాలను సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోరు.


➦ అభ్యర్థులు అభ్యంతరాలతో పాటు సరైన సమాధానానికి సంబంధించిన రుజువులు లేదా రిసోర్సు కాపీలను పీడీఎఫ్‌ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.


➦ అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి అభ్యంతరాలు సమర్పించాలి. 


➦ ఇంగ్లిష్‌లోనే అభ్యంతరాలు నమోదుచేయాలి.



తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌లో 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి ఆగస్టు 27న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాతపరీక్ష హాల్‌టికెట్లను జనవరి 2న విడుదల చేసింది.  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో జనవరి 8న రాతపరీక్ష నిర్వహించింది. పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని జనవరి 20న విడుదల చేసింది. ఆన్సర్ కీపై జనవరి 24 వరకు అభ్యంతరాలు స్వీకరించి, తదనంతరం ఫైనల్‌కీతోపాటు ఫలితాలను కూడా కమిషన్ విడుదల చేయనుంది.  


తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..