తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక కీలో అభ్యంతరాల స్వీకరణ నవంబర్ 16న ప్రారంభమైంది. నవంబర్ 20న సాయంత్రం 5 గంటల్లోగా అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ ప్రత్యేక లింకును ఏర్పాటు చేసింది. ఈ లింక్ ద్వారా మీరు అభ్యంతరం చేయవలసిన ప్రశ్నలకు తగిన ఆధారాలను పీడీఎఫ్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే అబ్జెక్షన్లను ఎట్టిపరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకునేదిలేదని స్పష్టం చేశారు. అభ్యంతరాలను మెయిల్స్ ద్వారా గానీ.. ఫోన్ ద్వారా గానీ వ్యక్తం చేయడానికి వీల్లేదు.
ఆన్సర్ కీపై అభ్యంతరాలకు క్లిక్ చేయండి..
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నవంబరు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ ద్వారా తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, టీఎస్పీఎస్సీ ఐడీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్స్, ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ 'కీ', రెస్పాన్స్ షీట్ల కోసం..
తెలంగాణలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ అండ్ పుడ్(హెల్త్) అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జులై 21న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జులై 29 నుంచి ఆగస్టు 26 వరకు దరఖాస్తులు స్వీకరిచింది. అక్టోబరు 31న రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 7న పరీక్ష నిర్వహించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్మాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరిగింది.
Also Read:
'గ్రూప్-1'లో 5 ప్రశ్నల తొలగింపు, మార్కుల కేటాయింపు ఇలా!
తెలంగాణ తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించినన ఫైనల్ ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ నవంబరు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలన తర్వాత ఫైనల్ కీని టీఎస్‌పీస్సీ విడుదల చేసింది. అభ్యంతరాలు నమోదుచేసిన అభ్యర్థులు ఫైనల్ కీ సరిచూసుకోవచ్చు.'గ్రూప్-1' ప్రిలిమినరీ కీపై అభ్యర్థుల నుంచి పలు అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సబ్జెక్టు నిపుణుల కమిటీలకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ కమిటీ అభ్యంతరాలను క్షుణ్నంగా పరిశీలించి.. 5 ప్రశ్నలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో రెండు ప్రశ్నలకు రెండు కంటే ఎక్కువ సమాధానాలు సరైనవిగా ప్రకటించింది.
గ్రూప్-1 ఫైనల్ కీ, మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్ష 'కీ' విడుదల, అందుబాటులో రెస్పాన్స్ షీట్లూ !
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నవంబరు 15న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ ద్వారా తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, టీఎస్పీఎస్సీ ఐడీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్స్, ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ 'కీ', రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..