TSPSC Group 1 Applications: తెలంగాణలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు శనివారం (మార్చి 16)న సాయంత్రం 5 గంటలతో ముగిసింది. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించినట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు మార్చి 23 నుంచి 27 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. 

వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ వివరాలు ఎడిట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిల్‌ లేదా నేరుగా వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోరు. సవరించిన అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పీడీఎఫ్‌ ఫార్మట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఒక్కసారి వివరాలు సవరించుకున్న తర్వాత అభ్యర్థులు క్షుణ్నంగా పరిశీలించుకోవాలి. సమర్పించిన తర్వాత మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు.  

వాస్తవానికి మార్చి 14తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉన్పప్పటికీ.. చివరి రోజు సర్వర్‌ మొరాయించడంతో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. అప్పటివరకు కేవలం 2.7 లక్షల దరఖాస్తులే వచ్చాయి. దీనిపై అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మార్చి 16న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు గడువు పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఇక మార్చి 16తో దరఖాస్తుల గడువు ముగిసేసరికి 4.03 లక్షల దరఖాస్తులు అందాయి. కాగా, గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 9వ తేదీన, మెయిన్స్‌ పరీక్షను అక్టోబర్‌ 21వ తేదీన నిర్వహించనున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఆదరణ తగ్గినట్టుగా కనిపిస్తున్నది. గత నెల 19న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ కాగా, అదే నెల 23 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. మార్చి 14 వరకు దరఖాస్తుల తుది గడువుగా నిర్ణయించారు. అయితే, మార్చి 13 వరకు 2.70 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొన్నారని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పాత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా 500 పోస్టులకు భారీగా 3.80 లక్షల దరఖాస్తులు నమోదైనట్టు గతంలో టీఎస్‌పీఎస్సీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దరఖాస్తు గడువు ముగియడంతో 4.8 లక్షల మంది దరఖాస్తులు సమర్పించినట్లు కమిషన్ ప

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్ (6 పేపర్లు) పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 

గ్రూప్-1 పోస్టుల వివరాలు..

క్ర.సం పోస్టులు ఖాళీల సంఖ్య
1. డిప్యూటీ కలెక్టర్ 45
2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 115
3. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48
4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 04
5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 07
6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 06
7. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) 05
8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08
9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30
10. మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 41
11. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/
డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
03
12. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/
అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్)
05
13. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02
14. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 05
15. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ గ్రేడ్-2 20
16. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్) 38
17. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 41
18. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 140
  మొత్తం ఖాళీలు 563

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...