TSPSC Group 4 Certificate Verification Schedule: తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగార్థులకు జూన్ 20 నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. గ్రూప్-4 పరిధిలో 8,180 పోస్టుల భర్తీకి 1: 3 నిష్పత్తిలో మొత్తం 24,030 మందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనుంది. ఆగస్టు 21 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10.30 గంటలకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులకు హైదరాబాద్-నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంతోపాటు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి) ప్రాంగణంలో సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనున్నారు.


గ్రూప్-4 సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా, షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


CERTIFICATES VERIFICATION MATERIAL


సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే వేదికలు:


1) O/o TGPSC, Prathibha Bhavan, Nampally, Hyderabad and


2) Potti Sreeramulu Telugu University, Lalitha Kala Kshetram, Public Gardens, Hyderabad.  


సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఇవి అవసరం.. 


➥ వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.


➥ దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ  


➥ పరీక్ష హాల్‌టికెట్


➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో. 


➥ 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి. 


➥డిగ్రీ లేదా పీజీ ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో. 


➥ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).


➥ బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.


➥ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులగుతై వయోపరిమితి సడలింపు కోసం సర్వీస్ సర్టిఫికేట్/NCC  ఇన్‌స్ట్రక్టర్/ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 


➥ పీహెచ్ సర్టిఫికేట్ (SADERAM సర్టిఫికేట్).


➥ ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి. 


➥ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి. 


➥ నోటిఫికేషన్‌ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు తీసుకురావాలి. 


గ్రూప్-4 ముఖ్యాంశాలు..


⫸ తెలంగాణలో 'గ్రూప్-4' పోస్టుల భర్తీకి 2022, డిసెంబరు 2న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.


⫸ అభ్యర్థుల నుంచి డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరించింది. కమిషన్ మొదట విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో మాత్రం 8039 పోస్టులనే భర్తీ చేయనున్నట్లు తెలిపింది. తర్వాత ఈ పోస్టులకు అదనంగా 141 పోస్టులను జతచేయండంతో.. మొత్తం పోస్టులు సంఖ్య 8,180 కి చేరింది.


⫸ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2203, జులై 1న రాతపరీక్ష నిర్వహించింది. గ్రూప్-4 పరీక్ష కోసం మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌-1కు 7,62,872 మంది, పేపర్-2కు 7,61,198 మంది హాజరయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్ష నిర్వహించారు.


⫸ గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 28న విడుదల చేసింది. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 అవకాశం కల్పించింది. అనంతరం అక్టోబరు 6న ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేయగా.. పలు మార్పులు చోటుచేసుకున్నాయి. దానికి అనుగుణంగా ఫలితాలను వెల్లడించింది గ్రూప్-4 పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి 9న విడుదలయ్యాయి. మొత్తం 7,26,837 మంది అభ్యర్థులతో  మెరిట్ జాబితాను టీఎస్‌పీస్సీ విడుదల చేసింది. తాాజాగా గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను కమిషన్ వెల్లడించింది. 


గ్రూప్-4 పోస్టులకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..