Karimnagar Latest News: కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసును డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఆ ఎస్సైను సర్వీసు నుంచి ప్రభుత్వం తొలగించింది. పోలీసులు ఎస్సైని అరెస్టు చేసి అనంతరం పరకాల సబ్ జైలుకు తరలించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Karimnagar News) మాదాపూర్ మండలం కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ (SI Bhavani Sen) లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళా సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఓ మహిళా కానిస్టేబుల్ పై వరుసగా అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఎవరికైనా ఈ విషయం చెప్తే గన్ తో కాల్చి చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి మహిళా కానిస్టేబుల్ (Woman Constable) తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో దీనిపై విచారణ జరపాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను వేధించినట్లు నిర్ధారించినట్టుగా తెలిసింది.
కాళేశ్వరంలో (Kaleshwaram News) ఓ కీచక ఎస్సై లైంగిక వేధింపుల ఆరోపణ వెలుగులోకి వచ్చాయి. కాటారం సబ్ డివిజన్లోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ.. మహిళా కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించాడని ఆమె ఫిర్యాదు చేసింది. అయితే సదరు ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (SC ST Atrocities Act) నమోదు చేసినట్లు సమాచారం. ఎస్సై సర్వీస్ రివాల్వర్ డీఎస్పీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.