TSPSC Group 3 Hall Ticket 2024 | హైదరాబాద్‌: గ్రూప్‌-3 పరీక్షల హాల్‌ టికెట్లు వచ్చేశాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ హాల్ టికెట్లను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. నవంబర్ 10 నుంచి అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు TGPSC అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో టీజీపీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గ్రూప్ 3 ఎగ్జామ్ హాల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి


అభ్యర్థులకు అలర్ట్, ఆలస్యమైతే అంతే


నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్‌ 1 ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరగనుంది. నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 3 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం నిర్వహించే పరీక్షలకు 9:30 తర్వాత ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించరు. మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2:30 అనంతరం ఎగ్జామ్ హాల్ లోకి అనుతించరని టీజీపీఎస్సీ తెలిపింది.


మొత్తం Group 3 పోస్టులు 1388


మొత్తం 1388 పోస్టులను గ్రూప్‌-3లో భర్తీ చేయనున్నారు. TSPSC 2022 డిసెంబర్ 30వ తేదీన 1363 పోస్టులతో Group 3 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత మరో 13 పోస్టులను అదనంగా చేర్చారు. మొత్తం పోస్టులు 1388కి పెరిగాయి. గ్రూప్ 3 పరీక్షలో మొత్తం 3 పేపర్లు.. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. రాత పరీక్ష, ఆధారంగానే గ్రూప్‌-3లో పోస్టుల భర్తీ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు. 


Also Read: TG TET Fee: తెలంగాణలో టెట్‌ రాస్తున్న అభ్యర్థులకు హ్యాపీ న్యూస్- ఫీజు తగ్గించిన ప్రభుత్వం- వాళ్లకు మాత్రం ఫ్రీ



గ్రూప్ 3 మూడు పేపర్లు.. మొత్తం 450 మార్కులు


గ్రూప్ 3లోని పేపర్ 1లో జాతీయ, అంతర్జాతీయ కరెంట్ ఆఫైర్స్, జనరల్ నాల్జెడ్ కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. విపత్తు నిర్వహణ, తెలంగాణ జాగ్రఫీ, లేటెస్ట్ అంశాలకు సంబంధించిన  ప్రశ్నలు వస్తాయి. ఇక పేపర్‌-2లో మొత్తం 3 అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.. ప్రతి అంశానికి సంబంధించి 50 ప్రశ్నలు.. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది. మరో అంశం భారత రాజ్యాంగం.. ఇందులోనూ 50 ప్రశ్నలకు 50 మార్కులు, భారత చరిత్రకు 50 ప్రశ్నలు మరో 50 మార్కులు కేటాయించారు. తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యం అంశానికి 50 మార్కులు ఉన్నాయి. పేపర్‌-3లో మూడు అంశాలు భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అన్ని రంగాల్లో అభివృద్ధి ఉన్నాయి. ఒక్కో అంశానికి సంబంధించి 50 ప్రశ్నలు వస్తాయి మొత్తం 150 మార్కులున్నాయి. మొత్తంగా గ్రూప్ 3లో 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  


Also Read: 10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు