Telangana 10th Exams Fee Payment Dates: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ చదువుతున్న విద్యార్థులతో పాటు బ్యాకలాగ్ ఉన్న విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 18వ తేదీ వరకూ ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకూ, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21వ తేదీ వరకూ ఫీజు చెల్లించుకోవచ్చు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ.125 ఫీజు చెల్లించాలి. 3 పేపర్ల లోపు ఉంటే రూ.110, 3 పేపర్ల కంటే ఎక్కువ బ్యాకలాగ్స్ ఉన్న విద్యార్థులు రూ.125 చెల్లించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. పూర్తి వివరాలకు https://www.bse.telangana.gov.in లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.


ఏపీ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్


అటు, ఏపీ (AP) టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల చేస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. రూ.50 ఆలస్య రుసుముతో ఈ నెల 12 నుంచి 18 వరకూ ఫీజు చెల్లించవచ్చు. రూ.200 అదనపు రుసుముతో 19 నుంచి 25వ తేదీ వరకూ.. రూ.500 ఆలస్య రుసుముతో ఈ నెల 26 నుంచి 30 వరకూ పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుందని.. పాఠశాల లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులు కూడా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in చూడాలని సూచించారు.


Also Read: Congress Vs BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాల పేలుళ్లు - ఆటంబాబులు పేలుతాయా?