TGPSC Group2 Application Edit: తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నమోదుచేసిన వివరాల్లో తప్పుల సవరణకు(Group-2 Application Edit)  టీజీపీఎస్సీ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ జూన్ 16న ప్రారంభంకాగా.. జూన్ 20న సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. ఇప్పటివరకు వివరాలు సరిచేసుకోలేని అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎందుకంటే దరఖాస్తుల సవరణకు ఇదే చివరి అవకాశమని, మరోసారి అవ‌కాశం ఉండ‌ద‌ని TGPSC ఇప్పటికే స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకున్న తర్వాత త‌ప్పనిస‌రిగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని కమిషన్ సూచించింది. 


గ్రూప్-2 దరఖాస్తుల సవరణ కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల (Group2 Posts) భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 2022-డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు (Group2 Applications) దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీ నెలకొంది.


* గ్రూప్-2 పోస్టుల వివరాలు


మొత్తం ఖాళీల సంఖ్య: 783



  • మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు

  • అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు

  • నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు

  • సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు

  • అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు

  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు

  • మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు

  • ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు

  • అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు

  • డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు

  • అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

  • అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు

  • అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు


పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
గ్రూప్-2 మొత్తం 600 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి.


➥ పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు. 


➥ పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు.


➥ పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్): 150 ప్రశ్నలు-150 మార్కులు.


➥ పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ): 150 ప్రశ్నలు-150 మార్కులు.  



గ్రూప్-2 నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్, ధ్రువపత్రాల పరిశీలనకు 24 వేలమంది ఎంపిక - షెడ్యూలు ఇదే
తెలంగాణలో గ్రూప్-4 ఖాళీల (Group4 Recruitment) భర్తీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థులకు జూన్ 20 నుంచి ఆగస్టు 21 మధ్య ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు మొత్తం 24,030 అభ్యర్థులు ఎంపికయ్యారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10.30 గంటలకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకానుంది. తేదీలవారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్న అభ్యర్థుల హాల్‌టికెట్ నెంబర్లను కమిషన్ ప్రకటించింది.
ధ్రువపత్రాల పరిశీలన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...