TSPSC Group I Recruitment 2022: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన తొలి గ్రూప్ -1 పోస్టుల నోటిఫికేషన్ దరఖాస్తు గడువు నేటితో యుగియనుంది. వాస్తవానికి మే నెలాఖరుతో తుది గడువు ముగియగా.. అభ్యర్థులకు మరో అవకాశం కల్పించిన టీఎస్‌పీఎస్సీ జూన్ 4 వరకు అవకాశం కల్పించింది. మొత్తం 503 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాగా, మే 31 నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆన్‌లైన్ పేమెంట్, సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా.. అభ్యర్థుల కోరిక మేరకు టీఎస్‌పీఎస్సీ గడువును నాలుగు రోజులు పొడిగించింది. అయితే నేటితో గ్రూప్ 1 దరఖాస్తుల తుది గడువు ముగియనుంది.
నేటితో ముగియనున్న తుది గడువు..
గ్రూప్ 1 అభ్యర్థులు గ్రీవియెన్స్ సెల్ లో చేసిన ఫిర్యాదుల ప్రకారం కొందరు పేమెంట్స్ సమయంలో కార్డు ఇష్యూ, రాంగ్ పిన్, పలు సాంకేతిక సమస్యలతో పేమెంట్స్ చేయలేకపోయారని టీఎస్ఎస్పీసీ గుర్తించింది. చివరి రోజున (మే 31) అప్లై చేసిన చాలా మందికి ఇలాంటి సమస్యలు రావడంతో అవకాశం కోల్పోతామని భయాందోళనలో ఉన్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుర్తించింది. దీంతో మరో అవకాశం కల్పిస్తూ ఈ నెల(జూన్) 4వ తేదీ వరకూ గ్రూప్ -1 అప్లికేషన్లు సబ్మిషన్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. శనివారం 4వ తేదీ రాత్రి 11:59 వరకు పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇదే తుది గడువు కావడంతో నేడు మరికొన్ని దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉంది.
తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 దరఖాస్తు విధానం ఇదే..
- అభ్యర్థులు ముందుగా టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ను సందర్శించండి
- మీరు ఇదివరకు రిజిస్టర్ కానీ వారైతే న్యూ రిజిస్ట్రేషన్ (OTR)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకోసం మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. వివరాలు నింపి సబ్మిట్ చేయాలి
- మీరు గతంలో రిజిస్టర్ అయిన వారైతే ఎడిట్ ఓటీఆర్ (Candidate Login) మీద క్లిక్ చేసి వివరాలు అప్‌డేట్, ఎడిట్ చేసుకోవాలి.
ఓటీఆర్ వివరాలతో పాటు
అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజును డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, టీ వ్యాలెట్ ద్వారా చెల్లించాలి. ఫీజు చెల్లించిన తరువాత అప్లికేషన్ పేజీని పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవాలి.
గ్రూప్ -1 పోస్టులు శాఖలవారీగా వివరాలు
- జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు - 5
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 40
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు -38
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పోస్టులు - 20
- డీఎస్పీ పోస్టులు - 91
- జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు - 2
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టులు - 8
- జిల్లా ఉపాధి అధికారి పోస్టులు - 2
- జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు - 6
- గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు - 35
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టులు - 121
- జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు - 5
- సీటీఓ పోస్టులు - 48
- డిప్యూటీ కలెక్టర్లు పోస్టులు - 42
- అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు - 26
- ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు - 4
- జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు - 2