Telangana Group-I : తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇచ్చింది. దరఖాస్తులలో తప్పిదాలు సవరించుకునేందుకు, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వివరాలు అప్ డేట్ చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఇచ్చిన చివరి అవకాశం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో జూలై 28కి పొడిగించారు. ఈ నెల 28న సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ 1 అభ్యర్థులు తమ తప్పిదాలను సరిచేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ 503 గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. తొలిసారి ఈ గడువు జూన్ తొలి వారంలోనే ముగిసింది.


తుది అవకాశం ముగిసినా మరో ఛాన్స్..
గ్రూప్ 1 అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులు సరి చేసుకునేందుకు మరో ఛాన్స్ ఇవ్వాలని, ఓటీఆర్ అప్ డేట్ కోసం సైతం మరోసారి అవకాశం ఇవ్వాలని కోరడంతో టీఎస్‌పీఎస్సీ అందుకు అంగీకరించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. జూలై 19 ఉదయం 8 గంటల నుంచి అప్లికేషన్ ఎడిట్, ఓటీఆర్ అప్ డేట్ ప్రారంభం కాగా, జూలై 21 సాయంత్రం 5 గంటలకు ముగియడంతో జూలై 28 వరకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు చివరి అవకాశం  ఇచ్చింది. www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అప్లికేషన్లను ఎడిట్‌ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది.  అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన చివరి గడువు ముగిసింది. కొందరు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 


ఓటీఆర్‌లో మార్పులు చేస్తే సరిపోదు.. ఇది తెలుసుకోండి
గ్రూప్ 1 అభ్యర్థులు కేవలం ఓటీఆర్‌లో వివరాలు మార్పులు చేసి అంతా ఓకే అనుకుంటున్నారు. కానీ ఓటీఆర్‌లో తప్పులు సరిదిద్దడం, మార్పులు చేశాక కచ్చితంగా Edit Option కి వెళ్లి సబ్మిట్ కొడితేనే అప్లికేషన్ ఫామ్‌ అప్‌డేట్ అవుతుంది. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులను ఈ విషయంపై హెచ్చరించింది. Employment Status ను Yes అని మార్చినట్లయితే.. ఆ అభ్యర్థులు సెల్ఫ్ డిక్లరేషన్ లేక జాబ్ అపాయింట్ మెంట్ ఆర్డర్‌ను అప్‌లోడ్ చేయాలని సూచించారు. 


అక్టోబర్ 16న ప్రిలిమ్స్ 
తెలంగాణలో నిర్వహించనున్న తొలి గ్రూప్‌-1 పోస్టుల ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ఖరారు చేసింది. అక్టోబరు 16వ తేదీన టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సాధారణంగా గ్రూప్ -1 జాబ్ అంటే జిల్లాలోని పలు విభాగాలలో అత్యున్నత స్థాయి పోస్టులు ఉంటాయి కనుక కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ పోస్టులు సాధిస్తే భవిష్యత్తులో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడతారు. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సైతం గ్రూప్ 1 ఉద్యోగాలకు భారీగా దరఖాస్తు చేసుకుంటారు. 
Also Read: TS EDCET 2022: రేపే టీఎస్ ఎడ్‌సెట్‌ 2022 ఎగ్జామ్, అభ్యర్థులు ఇవి తప్పక పాటించండి