తెలంగాణలో వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎస్‌ఐ, ఏఎస్ఐ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు ఆగస్టు 8న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.  కీలకమైన కటాఫ్ మార్కుల ప్రక్రియను పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి తాజాగా ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఫలితాల వివరాలకు సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేసింది.


తుది ఎంపిక ఫలితాలకు సంబంధించి మొత్తం 587 ఎస్‌ఐ పోస్టులకుగాను 434 మంది పురుషులు, 153 మంది మహిళలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులు, కేటగిరీ వారీ వివరాలను వెల్లడించింది. ఎంపిక ప్రక్రియ పూర్తయిందని పేర్కొంది. గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక రాతపరీక్షతో ఈ నియామక ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. 


ఫలితాల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


➥ ఎస్‌సీటీ ఎస్‌ సివిల్ ఫలితాలు


➥ ఎస్‌సీటీ ఆర్‌ఎస్‌ఐ ఏఆర్ ఫలితాలు 


➥ ఎస్‌సీటీ ఆర్‌ఎస్‌ఐ ఎస్ఏఆర్‌సీపీఎల్ ఫలితాలు


➥ ఎస్‌సీటీ ఆర్‌ఎస్‌ఐ టీఎస్ఎస్‌పీ ఫలితాలు


➥ ఎస్‌సీటీ ఎస్‌ఐ ఎస్‌పీఎఫ్ ఫలితాలు


➥ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఫలితాలు


➥ డిప్యూటీ జైలర్ ఫలితాలు


Results Direct Link


బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాతే నియామక పత్రాలు.. 
తుది ఎంపిక జాబితాలో పేరున్నా... అప్పుడే ఉద్యోగపత్రం అందుకునే అవకాశం ఉండదు. తుది జాబితాకు ఎంపికైన సాధించిన అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్,  వ్యక్తిగత ప్రవర్తన, క్రిమినల్ కేసులపై ఆరా తీయనుంది. గరిష్ఠంగా పది రోజుల్లోనే స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) విభాగంతో విచారణ జరిపించిన అనంతరం అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనుంది. దీన్నిబట్టి ఆగస్టు రెండోవారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు.. ఇలా అన్ని విభాగాలకు పంపనుంది.  ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన నేపథ్యం, నేరచరిత్ర, ప్రవర్తన... తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియను జిల్లాలవారీగా స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) చేపట్టనుంది. క్రిమినల్ అండ్ క్రైమ్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్(సీసీటీఎన్‌ఎస్) డేటాను విశ్లేషించడంతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయి పరిశీలనపైనా ఎస్‌బీ దృష్టి సారించనుంది. విజేతల తాత్కాలిక, శాశ్వత చిరునామాల్లో పర్యటించి అక్కడి ఠాణాల్లో ఏమైనా కేసులున్నాయా...? అని పరిశీలించిన తర్వాత మండలికి నివేదిక పంపనున్నారు. ఆ నివేదికలో క్లీన్ చిట్ లభిస్తేనే ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటారు.


కానిస్టేబుల్ ఫలితాలపై జీవో నం.46 ఎఫెక్ట్..
ఎస్‌ఐ ఎంపిక ఫలితాలు వెలువడినప్పటికీ.. కానిస్టేబుల్ ఎంపిక ఫలితాల వెల్లడి విషయంలో మాత్రం జాప్యం జరుగుతోంది. దీనికి జీవో నం.46కు సంబంధించిన న్యాయవివాదం నడుస్తుండడమే కారణం. ఈ జీవో రాష్ట్రప్రభుత్వంలోని 9 శాఖలకు సంబంధించిందైనా ప్రస్తుతం హోంశాఖ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్(టీఎస్‌ఎస్‌పీ) చుట్టూ కేంద్రీకృతమైంది. కంటీజియస్ జిల్లా కేడర్ పోస్టుల భర్తీ కోసం రూపొందించిన రేషియో కారణంగా తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. దీంతో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎస్ఐ పోస్టులు కంటీజియస్ జిల్లా కేడర్ పరిధిలో లేకపోవడంతో వాటి ఫలితాల వెల్లడిలో సమస రాలేదు. కాని కానిస్టేబుల్ పోస్టులు మాత్రం ఇదే కేడర్‌లో ఉండటంతో న్యాయస్థానం తీర్పు కోసం వేచి చూడాల్సి రానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జీవో నం.46 విషయం సాధారణ పరిపాలన శాఖ పరిధిలో ఉండడంతో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమేర్పడింది.




ALSO READ:


1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..