తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది పరీక్షల షెడ్యూలును పోలీసు నియామక మండలి జనవరి 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 12 నుంచి ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9న సివిల్‌ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 23న అన్ని రకాల కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు.


కాగా, ప్రస్తుతం ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ ఈవెంట్స్‌ కొనసాగుతున్నాయి. జనవరి 5తో దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను నియామక మండలి ఖరారు చేసింది. హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.


ఫైనల్ పరీక్షల షెడ్యూలు ఇలా.. 


➥మార్చి 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (IT&CO) టెక్నికల్ పేపర్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ ఏఎస్‌ఐ(FPB) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.


➥ మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (PTO) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.


➥ ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు.


➥ ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు.


➥ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు.


➥ ఇక చివరగా ఏప్రిల్ 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు.