తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామకాల్లో భాగంగా నిర్వహించిన ఎస్‌ఐ, ఏఎస్‌ఎస్‌ తుది పరీక్షల ప్రిలిమినరీ 'కీ' మే 11న విడుదలైంది. పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మే 14న సాయంత్రం 5 గంటల వరకు తెలపవచ్చు. అయితే ప్రశ్న, దానికి సంబంధించిన జవాబు ఆధారాలను నిర్ణీత నమూనాలో సమర్పించాల్సి ఉంటుంది. ఏఎస్‌ఐ ఎఫ్‌పీబీ, ఎస్‌ఐ ఐటీ అండ్‌ సీఓ టెక్నికల్‌ పేపర్ల (ఆబ్జెక్టివ్‌ టైప్‌) తుది పరీక్షలను మార్చి 11న, ఎస్‌ఐ పీటీవో పరీక్షను మార్చి 26న, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ పేపర్లను ఏర్పిల్‌ 8న, జనరల్‌ స్టడీస్‌ పేపర్ల ఫైనల్‌ ఎగ్జామ్‌ను ఏప్రిల్‌ 9న నిర్వహించిన విషయం తెలిసిందే.


SCT SI Civil and / or Equivalent / SCT SI IT&CO / SCT SI PTO / SCT ASI FPB


Preliminary Keys:


➥ Arithmetic and Test of Reasoning / Mental Ability 


➥ General Studies


Apply for Preliminary Keys objections on FWE


SCT SI IT&CO / SCT SI PTO / SCT ASI FPB


Preliminary Keys:


➥ SCT SI IT & CO (Technical Paper) 


➥ SCT SI PTO (Technical Paper) 


➥ SCT ASI FPB (Technical Paper) 


➥ Arithmetic and Test of Reasoning / Mental Ability


 Apply for Preliminary Keys objections on FWE


ఆన్సర్ కీ అభ్యంతరాల నమూనా ఇలా..




Also Read:


టీఎస్‌పీఎస్సీ లైబ్రేరియన్‌ పోస్టుల పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! షెడ్యూలు ప్రకారమే పరీక్ష!
తెలంగాణ ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.ప్రకటించిన షెడ్యూలు ప్రకారం, మే 17న లైబ్రేరియన్ పోస్టుల రాతపరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


వెబ్‌సైట్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్‌టికెట్లు! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న రెండు సెషన్లలో అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


'గ్రూప్-4' అభ్యర్థుల‌కు అలర్ట్, దరఖాస్తుల సవరణకు అవకాశం- తేదీలివే!
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్ -4 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. గ్రూప్-4 రాత ప‌రీక్షను జులై 1న నిర్వహించ‌నున్నారు. అయితే ప‌లువురు అభ్యర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల్లో త‌ప్పులు చేశారు. దీంతో అభ్యర్థుల వినతుల మేర‌కు త‌మ ద‌ర‌ఖాస్తుల్లో త‌ప్పులు స‌రిచేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవ‌కాశం క‌ల్పించింది. మే 9 నుంచి 15 వ‌ర‌కు అభ్యర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల్లో త‌ప్పుల‌ను స‌రి చేసుకోవ‌చ్చని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 'గ్రూప్-4' కింద 8,039 ఉద్యోగాల భ‌ర్తీకి గతేడాది డిసెంబరు 2న నోటిఫికేష‌న్ వెలువడిన విష‌యం విదిత‌మే. గ్రూప్-4 ఉద్యోగాలకు దాదాపు 9 ల‌క్షల మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో అభ్యర్థులు చిన్నచిన్న పొర‌పాట్లు చేశారు. వీరికోసం అప్లికేషన్ ఎడిట్‌కు టీఎస్‌పీఎస్సీ అవ‌కాశం క‌ల్పించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..