హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ సాధికారత విభాగం 2023-24 సంవత్సరానికి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఈడీ, స్పెషల్ బీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్‌ స్కోరు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 30


* ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్: 15


* సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్: 15


అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఈడీ, స్పెషల్ బీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్‌ స్కోరు సాధించి ఉండాలి.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


జీతం: నెలకు టీజీటీలకు రూ.35,000; ఎస్‌జీబీటీలకు రూ.30,000


పని ప్రదేశం: కరీంనగర్, మిర్యాలగూడ, హైదరాబాద్‌, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లోని దివ్యాంగుల ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Director, Department for Empowerment of Persons with Disabilities, Senior
Citizens and Transgender Persons, Telangana State, Ground Floor, Vikalangula
Sankshema Bhavan, Nalgonda X Roads, Malakpet, Hyderabad – 500 036.


దరఖాస్తుకు చివరి తేదీ: 14.06.2023.


Notification 


Website


Also Read:


హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిసెర్చ్ సెంటర్‌ ఇమారత్‌(ఆర్‌సీఐ) వివిధ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 150 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్‌)లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో జూన్ 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..