తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు మొదటివారంలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా సెప్టెంబర్‌ మూడోవారంలో టెట్‌ నిర్వహించాలని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ(ఎన్‌సీఈఆర్‌టీ) నిర్ణయించింది. ఇటీవల సమావేశంలో టెట్‌ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.  

ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు టెట్‌ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్‌ నిర్వహణపై అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. సెప్టెంబర్‌ 15 ముందు లేదా తర్వాత ఎప్పుడైనా నిర్వహించాలని భావిస్తున్నారు. అంతర్గతంగా టెట్‌ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.

రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 9,370 టీచర్ పోస్టులు ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆ వివరాలను గతేడాది మార్చి 21న విద్యాశాఖ సర్కార్‌కు సమర్పించింది. ఈ పోస్టులు కాక పదోన్నతుల ద్వారా 9,314 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుందని విద్యాశాక పేర్కొంది.  ఖాళీల భర్తీకి 'టెట్' నిర్వహించి. కొత్త టీచర్లు వచ్చే వరకు, పదోన్నతులు కల్పించే వరకు 13,684 మంది విద్యా వాలంటీర్లు అవసరం ఉంటుందని విద్యాశాఖ ప్రతిపాదించింది. 5 వేల మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన తర్వాతే వాలంటీర్లు అవసరమని స్పష్టం చేసింది.

ఖాళీల వివరాలు ఇలా..

పోస్టులు ఖాళీల సంఖ్య
స్కూల్ అసిస్టెంట్ 2,179
ఎస్‌జీటీ 6360
లాంగ్వేజ్ పండిట్ 669
పీఈటీ 162 
మొత్తం 9370

పోటీ 2 లక్షలకు పైగానే.. 
ఈ దఫా 'టెట్' పరీక్షకు పోటీ భారీగానే ఉండే అవకాశం ఉండనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్టంలో 1.5 లక్షల డీఈడీ, 4.5 లక్షల మంది బీఈడీ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ద్వారా 8,792 టీచర్‌ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేళ్ల క్రితం టెట్‌ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం కేవలం డీఈటీ వారికే ఇవ్వగా.. ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో గతంలో టెట్‌ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్‌ క్వాలిఫై కానివారి సంఖ్య 2 లక్షల వరకు ఉంటుంది. వీరితోపాటు కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తిచేసిన వారి సంఖ్య మరో 20 వేల వరకు ఉంటుంది. తాజా టెట్‌ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది.

పరీక్ష నిర్వహణకు 101 రోజులు..
పరీక్ష నిర్వహణకు మొత్తం 101 రోజులు పడుతుందని విద్యాశాఖ అంచనా వేసింది. టెట్ నోటిఫికేషన్‌ జారీ, ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు, ఇతర ప్రక్రియలు కలిపి పరీక్ష రోజుకు 80 రోజులు పడుతుందని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. టెట్ పరీక్ష ముగిసిన తర్వాత ఫలితాల వెల్లడికి 21 రోజులు కలిపి.. మొత్తం 101 రోజులు పడుతుందని అంచనా వేసింది. గతేడాది మార్చి 24న నోటిఫికేషన్‌ జారీ చేయగా.. పరీక్షను అదే సంవత్సరం జూన్‌ 27న నిర్వహించారు. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

కేంద్ర కొలువుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ - ఖాళీల వివరాలు
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-II, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ పోస్టుల భ‌ర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. పోస్టుల‌వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు బ‌ట్టి బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..